20 ఏళ్ల వయసులోనే టెస్ట్ కెప్టెన్ గా రషీద్ ఖాన్

బంగ్లాతో ఏకైకటెస్టులో అప్ఘన్ రికార్డుల మోత టెస్ట్ క్రికెట్లో బంగ్లాదేశ్ తొలి సెంచరీ హీరో రహ్మత్ షా చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్- అప్ఘనిస్థాన్ జట్ల మధ్య ప్రారంభమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ తొలిరోజునే పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి.  టెస్ట్ క్రికెట్ పసికూన అప్ఘనిస్తాన్ కెప్టెన్ గా రషీద్ ఖాన్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. 13 దశాబ్దాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం 20 సంవత్సరాల 350 రోజుల వయసులోనే అఫ్ఘన్ జట్టు పగ్గాలు […]

Advertisement
Update:2019-09-06 05:56 IST
  • బంగ్లాతో ఏకైకటెస్టులో అప్ఘన్ రికార్డుల మోత
  • టెస్ట్ క్రికెట్లో బంగ్లాదేశ్ తొలి సెంచరీ హీరో రహ్మత్ షా

చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్- అప్ఘనిస్థాన్ జట్ల మధ్య ప్రారంభమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ తొలిరోజునే పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి.

టెస్ట్ క్రికెట్ పసికూన అప్ఘనిస్తాన్ కెప్టెన్ గా రషీద్ ఖాన్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు.

13 దశాబ్దాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం 20 సంవత్సరాల 350 రోజుల వయసులోనే అఫ్ఘన్ జట్టు పగ్గాలు చేపట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

జింబాబ్వే కెప్టెన్ తతిండా తైబు పేరుతో ఉన్న అతిపిన్నవయస్కుడైన టెస్ట్ కెప్టెన్ రికార్డును రషీద్ ఖాన్ తిరగరాశాడు. 2004లో తైబు 20 ఏళ్ల 358 రోజుల వయసులో జింబాబ్వే జట్టు టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు.

అప్ఘన్ టెస్ట్ తొలి సెంచరీ హీరో రహ్మత్ షా…

గత ఏడాదే టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసిన పసికూన అఫ్ఘన్ తొలిటెస్ట్ సెంచరీ హీరోగా రహ్మత్ షా చరిత్ర సృష్టించాడు. చిట్టగాంగ్ లోని జహూర్ ఆహ్మద్ చౌదరి స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ ఐదురోజుల టెస్ట్ తొలిరోజు ఆటలో రహ్మత్ షా 102 పరుగులతో శతకం పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన బంగ్లా తొలిటెస్ట్ ప్లేయర్ గా రికార్డుల్లో చోటు సంపాదించాడు.

మాజీ కెప్టెన్ అస్గర్ అప్ఘన్ తో కలసి రహ్మత్ షా నాలుగో వికెట్ కు 120 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. తొలిరోజుఆటలో అఫ్ఘనిస్థాన్ జట్టు 5 వికెట్లకు 271 పరుగుల స్కోరు సాధించగలిగింది.

ఇప్పటి వరకూ రెండుటెస్టులు మాత్రమే ఆడిన అఫ్ఘనిస్థాన్ కు భారత్ చేతిలో ఓటమి, ఐర్లాండ్ పై గెలుపు రికార్డు ఉంది.

Tags:    
Advertisement

Similar News