యరపతినేనికి బిగ్ షాక్... సీబీఐకి కేసు అప్పగింత

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుకి గట్టి షాకే ఇచ్చింది. అక్రమ మైనింగ్ వ్యవహారం కేసును సీబీఐకి అప్పగించేందుకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని హైకోర్టుకు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తెలియజేశారు. యరపతినేని మైనింగ్ కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కోర్టుకు వివరించారు. యరపతినేని మైనింగ్‌ అత్యంత తీవ్రమైనది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. ఇటీవల సీఐడీ నివేదికను పరిశీలించిన హైకోర్టు… యరపతినేని అక్రమాలకు పాల్పడినట్టు నివేదిక బట్టి […]

Advertisement
Update:2019-09-04 10:42 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుకి గట్టి షాకే ఇచ్చింది. అక్రమ మైనింగ్ వ్యవహారం కేసును సీబీఐకి అప్పగించేందుకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని హైకోర్టుకు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తెలియజేశారు.

యరపతినేని మైనింగ్ కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కోర్టుకు వివరించారు. యరపతినేని మైనింగ్‌ అత్యంత తీవ్రమైనది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.

ఇటీవల సీఐడీ నివేదికను పరిశీలించిన హైకోర్టు… యరపతినేని అక్రమాలకు పాల్పడినట్టు నివేదిక బట్టి స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించే ఆలోచన ఉందా లేదా అన్నది ప్రభుత్వం తెలియజేయాలని కోర్టు కొద్దిరోజుల క్రితం ఆదేశించింది.

ఈ నేపథ్యంలో కేసును సీబీఐకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏజీ కోర్టుకు తెలియజేశారు.

Tags:    
Advertisement

Similar News