టెస్ట్ విజయాలలో కెప్టెన్ కొహ్లీ జంట రికార్డులు
ధోనీ, దాదా రికార్డులు అధిగమించిన కొహ్లీ కొహ్లీ కెప్టెన్ గా 48 టెస్టుల్లో 28 విజయాలు ఎనిమిదిన్నర దశాబ్దాల భారత టెస్ట్ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా విరాట్ కొహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. జమైకాలోని కింగ్స్ టన్ వేదికగా విండీస్ తో ముగిసిన రెండోటెస్ట్ విజయంతో కొహ్లీ అత్యధిక టెస్ట్ విజయాల కెప్టెన్ గా రికార్డుల్లో చేరాడు. ధోనీని అధిగమించిన కొహ్లీ.. ఇప్పటి వరకూ…. అత్యధిక టెస్ట్ విజయాలు సాధించిన భారత కెప్టెన్ […]
- ధోనీ, దాదా రికార్డులు అధిగమించిన కొహ్లీ
- కొహ్లీ కెప్టెన్ గా 48 టెస్టుల్లో 28 విజయాలు
ఎనిమిదిన్నర దశాబ్దాల భారత టెస్ట్ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా విరాట్ కొహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
జమైకాలోని కింగ్స్ టన్ వేదికగా విండీస్ తో ముగిసిన రెండోటెస్ట్ విజయంతో కొహ్లీ అత్యధిక టెస్ట్ విజయాల కెప్టెన్ గా రికార్డుల్లో చేరాడు.
ధోనీని అధిగమించిన కొహ్లీ..
ఇప్పటి వరకూ…. అత్యధిక టెస్ట్ విజయాలు సాధించిన భారత కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. ధోనీకి కెప్టెన్ గా 45 టెస్టులు ఆడి 27 విజయాలు, 18 పరాజయాలు, 17 డ్రాల రికార్డు ఉంది. కెప్టెన్ గా ధోనీ విజయశాతం 45గా మాత్రమే ఉంది.
విరాట్ కొహ్లీ టాప్ గేర్…
మరోవైపు …విరాట్ కొహ్లీ …ప్రస్తుతం విండీస్ రెండుమ్యాచ్ ల సిరీస్ వరకూ ఆడిన మొత్తం 48 టెస్టుల్లో భారతజట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు.
28 విజయాలు, 10 పరాజయాలు, 10 డ్రాల రికార్డుతో 58.33 విజయశాతం సాధించాడు. 2014 ఆస్ట్ర్రేలియా టూర్ లో భాగంగా జరిగిన టెస్ట్ సిరీస్ లో…ధోనీ నుంచి భారతజట్టు పగ్గాలను కొహ్లీ చేపట్టాడు.
ఆసీస్ ను ఆసీస్ గడ్డపై చిత్తు చేయడం ద్వారా భారత్ కు తొలిసారిగా 3-1తో సిరీస్ విజయం అందించిన ఘనత కొహ్లీకి మాత్రమే దక్కుతుంది.
గంగూలీ రికార్డు తెరమరుగు..
కెప్టెన్ గా విదేశీగడ్డపై గంగూలీ ఆడిన 28 టెస్టుల్లో 11 విజయాలు సాధించాడు. విరాట్ కొహ్లీ మాత్రం కేవలం 27 టెస్టుల్లోనే కెప్టెన్ గా 13 విజయాలతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.