బీజేపీలో ముదిరిన కోల్డ్‌వార్ !
ఏపీ బీజేపీ అయోమయంలో పడితే…. తెలంగాణ బీజేపీ గ్రూపు రాజకీయాలతో వేడెక్కింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో నాలుగు గ్రూపులు నడుస్తున్నాయి. వారి మధ్య ఆధిపత్యంతో పార్టీ పడుతూ లేస్తోంది. ఇప్పుడు జిల్లాలలో కూడా గ్రూపులు పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పోటీ చేయాలని ప్లాన్ వేశారు. కానీ తీరా ఎన్నికల సమయం నాటికి ఆయనకు టికెట్ రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి సంజయ్‌కు […]
ఏపీ బీజేపీ అయోమయంలో పడితే…. తెలంగాణ బీజేపీ గ్రూపు రాజకీయాలతో వేడెక్కింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో నాలుగు గ్రూపులు నడుస్తున్నాయి. వారి మధ్య ఆధిపత్యంతో పార్టీ పడుతూ లేస్తోంది. ఇప్పుడు జిల్లాలలో కూడా గ్రూపులు పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి.
కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పోటీ చేయాలని ప్లాన్ వేశారు. కానీ తీరా ఎన్నికల సమయం నాటికి ఆయనకు టికెట్ రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి సంజయ్‌కు టికెట్ వచ్చింది. ఎంపీగా ఆయన గెలిచారు. ఇప్పుడు జిల్లాలో పార్టీ తన కను సన్నల్లో నడిపేలా ప్రయత్నిస్తున్నారు.
అయితే తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా మురళీధర్‌రావు అప్పట్లో ప్రయత్నించారని సంజయ్ ఆరోపణ. అంతేకాదు ఎంపీగా పోటీ చేస్తే సహకరించలేదనేది మరో విమర్శ. అయితే ఇక్కడే సంజయ్ తనకు తెలిసిన రాజకీయం ప్రదర్శించారు. మురళీధర్ రావుకు చెక్ పెట్టేందుకు ఆయన మరో జాతీయ నేత రాంమాధవ్‌ను ఆశ్రయించారు. ఆయన అండదండలతోనే ఎంపీ టికెట్ వచ్చిందనేది బీజేపీ నేతల మాట.
కరీంనగర్ మురళీధర్‌రావు, సంజయ్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. దీంతో ఇప్పుడు మురళీకి చెక్ పెట్టేందుకు రాంమాధవ్‌ను కరీంనగర్‌కు పిలిచారు సంజయ్. ఆదివారం ఆయన పొగ్రామ్ ఉంది.
మొత్తానికి మరళీధర్‌రావు, రాంమాధవ్ మధ్యలో సంజయ్.. ఈ వార్ ఎలా నడుస్తుందో చూడాలి. ఇప్పటికే ఉన్న గ్రూపులతో కొట్టుకు చస్తుంటే కొత్త కొత్త గ్రూపులతో తలనొప్పులు పెరిగాయని కార్యకర్తలు వాపోతున్నారు.