యూఎస్ ఓపెన్ ప్రీ-క్వార్టర్స్ లో జోకోవిచ్, ఫెదరర్
నాలుగోరౌండ్లో జోకో వరుస సెట్ల విజయం టాప్ సీడ్ జోకోవిచ్ కు 23వ సీడ్ వావరింకా గండం అమెరికన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ కు ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జోకోవిచ్, మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ అలవోకగా చేరుకొన్నారు. న్యూయార్క్ లోని ఆర్థర్ యాష్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్ లో టాప్ సీడ్ జోకోవిచ్ భుజం నొప్పిని భరిస్తూనే ఆడి…అమెరికా ఆటగాడు డెనిస్ కుడియాను 6-3, […]
- నాలుగోరౌండ్లో జోకో వరుస సెట్ల విజయం
- టాప్ సీడ్ జోకోవిచ్ కు 23వ సీడ్ వావరింకా గండం
అమెరికన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ కు ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జోకోవిచ్, మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ అలవోకగా చేరుకొన్నారు.
న్యూయార్క్ లోని ఆర్థర్ యాష్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్ లో టాప్ సీడ్ జోకోవిచ్ భుజం నొప్పిని భరిస్తూనే ఆడి…అమెరికా ఆటగాడు డెనిస్ కుడియాను 6-3, 6-4, 6-2తో చిత్తు చేసి ప్రీ-క్వార్టర్స్ లో అడుగుపెట్టాడు.
క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం జరిగే సమరంలో 23వ సీడ్ ఆటగాడు వావరింకాతో జోకోవిచ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.
ఫెదరర్ అలవోక విజయం…
నాలుగోరౌండ్లో సెరెనా…
మహిళల సింగిల్స్ లో 24వ టైటిల్ కు గురిపెట్టిన ప్రపంచ మాజీ నంబర్ వన్, అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ నాలుగోరౌండ్ కు అర్హత సంపాదించింది.
మూడోరౌండ్ పోటీలో చెక్ ప్లేయర్ కారోలినా ముచోవాను 6-3, 6-2తో ఊదిపారేసింది. ప్రీ-క్వార్టర్స్ లో 22వ సీడ్, క్రొయేషియా ప్లేయర్ పెట్రా మార్టిచ్ తో సెరెనా తలపడనుంది.