ఇంత ధైర్యం మీరు ఎప్పుడైనా చేశారా?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతి రోజూ వరుస ట్వీట్లతో…. అబద్ధాలు ప్రచారం చేసే టీడీపీ నాయకులను హడలెత్తిస్తున్నారు. తాజాగా గ్రామ వాలంటీర్లు రిక్షాలు తొక్కాలి, మూటలు మోయాలి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ పై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు 4 లక్షల ఉద్యోగాలను సృష్టించి… గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్లుగా, గ్రామ సెక్రెటరీ ఉద్యోగాలుగా నియామకాలు చేస్తే అభినందించాల్సింది పోయి… వాళ్ళు రిక్షాలు తొక్కాలి, హమాలీ పని చేయాలి అంటూ […]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతి రోజూ వరుస ట్వీట్లతో…. అబద్ధాలు ప్రచారం చేసే టీడీపీ నాయకులను హడలెత్తిస్తున్నారు. తాజాగా గ్రామ వాలంటీర్లు రిక్షాలు తొక్కాలి, మూటలు మోయాలి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ పై మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు 4 లక్షల ఉద్యోగాలను సృష్టించి… గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్లుగా, గ్రామ సెక్రెటరీ ఉద్యోగాలుగా నియామకాలు చేస్తే అభినందించాల్సింది పోయి… వాళ్ళు రిక్షాలు తొక్కాలి, హమాలీ పని చేయాలి అంటూ నిరుద్యోగులను హేళన చేయడం, బెదరగొట్టడం సరికాదు…. ఈ పాపం ఊరికే పోదు చంద్రబాబు…. అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.
మీరు గతంలో ఎలాగూ ఉద్యోగాలను సృష్టించలేకపోయారు… ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న మంచి పనికి… ప్రశంసించే పెద్ద మనసు మీకు ఎలాగూ లేదని తెలుసు అంటూ చంద్రబాబు పై మండిపడ్డారు.
చంద్రబాబు గారు… వైఎస్జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్ళలో ఇలాంటి మంచి పనులు చాలా చేస్తుందని, మీరు కూడా చూస్తారని…. కాబట్టి మీరు గుండె రాయి చేసుకోండి అంటూ సలహా ఇచ్చారు.
టీటీడీ, దేవాదాయ శాఖల్లో హిందూయేతర ఉద్యోగుల పై కూడా ట్విట్టర్ లో స్పందించారు విజయసాయిరెడ్డి.
టీటీడీ, దేవాదాయ శాఖల్లో హిందూయేతర ఉద్యోగులు పనిచేయడాన్ని నిషేధిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని…. మీరు చెప్పుకునే 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఇలాంటి సాహసోపేత నిర్ణయం ఎప్పుడైనా తీసుకున్నారా? అని ప్రశ్నించారు.
మీరు కేవలం సెల్ఫ్ డబ్బా వాయించుకునే మనిషి మాత్రమేనని ఎద్దేవా చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదో ప్రజలకు వివరించాలని చంద్రబాబు ను డిమాండ్ చేశారు.
గ్రామ సచివాలయాలు,వలంటీర్ల వ్యవస్థ కోసం 4 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తే ప్రశంసించే పెద్ద మనసు లేదు.రిక్షాలు తొక్కాలని,హమాలీ పని చేయాలి అంటూ నిరుద్యోగులను బెదరగొట్టిన పాపం ఊరికే పోదు @ncbn గారూ.ఈ ఐదేళ్లలో ఇంకా చాలా చూస్తారు.గుండె రాయి చేసుకోండి. @naralokesh @JaiTDP @YSRCParty
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 30, 2019
టీటీడీ, దేవాదాయ శాఖల్లో హిందూయేతర ఉద్యోగులు పనిచేయడాన్ని నిషేధిస్తూ @AndhraPradeshCM గారు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సెల్ఫ్ డబ్బా వాయించుకునే పెద్ద మనిషి ఇన్నాళ్లు ఎందుకు ఇటువంటి చర్యలు తీసుకోలేదో ప్రజలకు వివరించాలి. @ysjagan @YSRCParty @ncbn
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 30, 2019