అవినీతి వీఆర్‌వోను కాలర్ పట్టుకుని నిలదీసిన వృద్ధురాలు

రెవెన్యూ వ్యవస్థలో కొందరు వీఆర్వోల కారణంగా జనానికి జీవితంపైనే విరక్తి కలుగుతోంది. బక్క చిక్కిన పేదలు, రైతుల నుంచి వేలకు వేలు లంచాలు తీసుకుంటూ వారి రక్తం తాగుతూ కూడా సమస్యలను పరిష్కరించకుండా ఆటలాడుతున్నారు. ఈ పరిస్థితిని చూసి కడుపు మండిన వారు అసలు వీఆర్‌వో వ్యవస్థనే లేకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలో ఒక వీఆర్‌వో … ఒక వృద్ధురాలి వద్ద లంచం తీసుకుని కూడా ఆమెకు పని చేయకుండా తిప్పుకుంటున్నాడు. దీంతో […]

Advertisement
Update:2019-08-30 09:05 IST

రెవెన్యూ వ్యవస్థలో కొందరు వీఆర్వోల కారణంగా జనానికి జీవితంపైనే విరక్తి కలుగుతోంది. బక్క చిక్కిన పేదలు, రైతుల నుంచి వేలకు వేలు లంచాలు తీసుకుంటూ వారి రక్తం తాగుతూ కూడా సమస్యలను పరిష్కరించకుండా ఆటలాడుతున్నారు. ఈ పరిస్థితిని చూసి కడుపు మండిన వారు అసలు వీఆర్‌వో వ్యవస్థనే లేకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలో ఒక వీఆర్‌వో … ఒక వృద్ధురాలి వద్ద లంచం తీసుకుని కూడా ఆమెకు పని చేయకుండా తిప్పుకుంటున్నాడు. దీంతో సహనం నశించిన పోచమ్మ అనే వృద్ధురాలు తహసీల్దార్ కార్యాలయం వద్దే ధైర్యం చేసింది.

అవినీతి వీఆర్‌వోను ఈడ్చుకొచ్చి కొట్టింది. నువ్వు అడిగినంత పైసలిచ్చినా… ఏడాదిగా తిరుగుతున్నా…. సమస్యను ఎందుకు పట్టించకోవడం లేదంటూ కాలర్ పట్టుకుని ఈడ్చుకొచ్చింది.

తన పేరన ఉన్న భూమిని…. మరొకరి పేర రాసి వేధిస్తున్నారని మేడుకుంద గ్రామానికి చెందిన పోచమ్మ వాపోయింది. అయితే తనను నిలదీసిన వృద్ధురాలిపై వీఆర్‌వో కండకావరం చూపాడు. తన కాలర్ పట్టుకుందన్న కోపంతో ఆమెను కిందకు తోసేశాడు. దాంతో ఆమెకు గాయాలయ్యాయి. అక్కడున్న వారు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Tags:    
Advertisement

Similar News