టీటీడీలో గండి ఆంజనేయ గుడి విలీనం
కడప జిల్లా చక్రాయపేట మండలం మారెళ్లమడక గ్రామంలో ఉన్న గండి వీరాంజనేయ స్వామి ఆలయం టీటీడీలో విలీనం అయింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ మేరకు విలీనాన్ని అధికారులు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఫైళ్లపై ఇరు ఆలయ అధికారులు బుధవారం సంతకాలు చేశారు. ఇకపై గండి ఆలయ ఆస్తులు, బంగారం, వెండితో పాటు ఆలయ ఉద్యోగుల బాధ్యత టీటీడీ చూసుకుంటుంది. విలీనం సమయానికి గండి ఆలయం పేరున రూ. 4కోట్ల 33 లక్షల నగదు […]
కడప జిల్లా చక్రాయపేట మండలం మారెళ్లమడక గ్రామంలో ఉన్న గండి వీరాంజనేయ స్వామి ఆలయం టీటీడీలో విలీనం అయింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ మేరకు విలీనాన్ని అధికారులు పూర్తి చేశారు.
ఇందుకు సంబంధించిన ఫైళ్లపై ఇరు ఆలయ అధికారులు బుధవారం సంతకాలు చేశారు. ఇకపై గండి ఆలయ ఆస్తులు, బంగారం, వెండితో పాటు ఆలయ ఉద్యోగుల బాధ్యత టీటీడీ చూసుకుంటుంది. విలీనం సమయానికి గండి ఆలయం పేరున రూ. 4కోట్ల 33 లక్షల నగదు ఉంది.
900 గ్రాముల బంగారం, 100 కిలోల వెండి, 13 ఎకరాల భూమి ఉంది. ఇకపై ఇవన్నీ టీటీడీ పర్యవేక్షణలో ఉంటాయి. టీటీడీలో విలీనం చేయడం వల్ల ఆలయం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.