ఐపీఎల్‌ కోల్‌కతా టీమ్‌ కెప్టెన్‌గా రహానే

వెంకటేశ్‌ అయ్యర్‌ కు వైస్‌ కెప్టెన్సీ.. ప్రకటించిన టీమ్‌ మేనేజ్‌మెంట్‌;

Advertisement
Update:2025-03-03 18:20 IST

టీమిండియా సీనియర్ ప్లేయర్‌ అంజిక్యా రహానే టాటా ఐపీఎల్‌ -2025లో కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ టీమ్‌ కు సారథ్యం వహించబోతున్నాడు. ఈ విషయాన్ని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సోమవారం వెల్లడించింది. వైస్‌ కెప్టెన్‌ గా వెంకయ్యర్‌ అయ్యర్‌ ను ఎంపిక చేసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతోన్న కోల్‌కతా గత సీజన్‌ లో జట్టును విజయపథాన నడిపించిన శ్రేయస్‌ అయ్యర్‌ ను రిటైన్‌ చేసుకోలేదు. దీంతో ఈ సీజన్‌ కు కొత్త కెప్టెన్‌ ఎంపిక తప్పలేదు. కొత్త జెర్సీతో తాము బరిలోకి దిగుతున్నామని వెల్లడించిన టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కొత్త జెర్సీ ధరించి ఉన్న రహానే, వెంకటేశ్‌ అయ్యర్‌, రింకూ సింగ్‌ లతో కూడిన ఫొటోను 'ఎక్స్‌'లో పోస్ట్‌ చేసింది.ఈనెల 22న ఐపీఎల్‌ ప్రారంభం కాబోతుంది. మొదటి మ్యాచ్‌ లో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ తో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తలపడనుంది.

Tags:    
Advertisement

Similar News