ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతోనే బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు
ఘన విజయం సాధించిన మల్క కొమురయ్య;
Advertisement
కరీంనగర్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలోనే ఫలితం తేలింది. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య ఈ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి కేవలం 428 ఓట్లు మాత్రమే సాధించారు. కొమురయ్య గెలుపును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ స్థానంలో మొత్తం 25,041 ఓట్లు పోల్ కాగా 897 ఓట్లు చెల్లుబాటు కాలేదు. కొమురయ్యకు 12,959 ఓట్లు రాగా, వంగ మహేందర్ రెడ్డికి 7,182 ఓట్లు, అశోక్ కుమార్ కు 2,621 ఓట్లు, కూర రఘోత్తమ్ రెడ్డికి 428, ఓట్లు, ఇన్నారెడ్డికి 320 ఓట్లు, సాయన్నకు 293 ఓట్లు పోలయ్యాయి. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలోనే గెలుపునకు కావాల్సిన 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు సాధించడంతో బీజేపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు.
Advertisement