కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పాటించి ఒక ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలి : కూనంనేని
కాంగ్రెస్ పార్టీ స్నేహ ధర్మాన్ని పాటించి ఒక ఎమ్మెల్సీ సీటు సీపీఐ పార్టీకి ఇవ్వాలని తెలంగాణ సీపీఐ కార్యదర్మి కూనంనేని సాంబశివ రావు విజ్ఞప్తి చేశారు;
కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించి ఒక ఎమ్మెల్సీ సీటు సీపీఐ పార్టీకి ఇవ్వాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను కోరారు. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ చాడ వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ భేటీ అయ్యారు. గతంలో 2 ఎమ్మెల్సీలు ఇచ్చేలా సీపీఐ-కాంగ్రెస్ గతంలో ఒప్పందం చేసుకున్నాయని గుర్తు చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, ఇన్‌ఛార్జ్ మీనాక్షిని కూడా కలిసి అడుగుతామని కునంనేని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీల కేటాయింపుపై సుదీర్ఘంగా చర్చించారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే వీరు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఇదిలా ఉండగా.. సీపీఐ పార్టీ తరపున సీనియర్ నేత చాడ వెంకట్ రెడ్డి ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. మాకు ఎమ్మెల్సీఅవకాశం ఇవ్వండి.. కాంగ్రెస్ కు మిత్ర పక్షాల ఒత్తిడి మరోవైపు.. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఎమ్మెల్యే కోటా కింద ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 3న నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 20న ఎన్నికలు.. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.