పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా విజయం
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం;
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. 7వ రౌండ్ ముగిసే సరికి ఆయనకు 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,41,491 ఓట్లు పోలవగా,, 21,577 చెల్లని ఓట్లుగా గుర్తించాఉ. 50 శాతానికి పైగా ఓట్లు సాధించడంతో ఆలపాటి రాజాను విజేతగా ప్రకటించారు.మరోవైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఇక్కడ మేజిక్ ఫిగర్ 10,068 ఓట్లు కాగా.. ఆయనకు 12,035 ఓట్లు వచ్చాయి. దాంతో ఆయన గెలిచినట్లు ప్రకటించారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి ఆధిక్యం లభించింది. దీంతో రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు ఘనవిజయం దిశగా దూసుకెళ్తున్నట్లయింది.