తెలంగాణ సీఎం మార్పు ఖాయం

ఇన్‌చార్జీ మార్పే దీనికి ఇండికేషన్‌ బీజేపీ శాసనసభ పక్షనేత మహేశ్వర్‌ రెడ్డి;

Advertisement
Update:2025-03-03 18:53 IST

తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీగా కాంగ్రెస్‌ హైకమాండ్‌ మీనాక్షి నటరాజన్‌ ను నియమించింది అంటే ఇక ముఖ్యమంత్రి మార్పు ఖాయమని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌ లో ఆయన మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. తెలంగాణలో సీఎం చేంజ్‌ మిషన్‌ ను పార్టీ హైకమాండ్‌ మీనాక్షి నటరాజన్‌ కు అప్పగించిందని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పునకు అవసరమైన గ్రౌండ్‌ ను ఆమె ప్రిపేర్‌ చేస్తారని చెప్పారు. డిసెంబర్‌లో ముఖ్యమంత్రి మార్పు తథ్యమన్నారు. వనపర్తి సభలో ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే ఇంకో పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్‌ చెప్పారని.. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదం కన్నా ఢిల్లీ నుంచి వచ్చిన ఆడబిడ్డ ఆశీర్వాదమే రేవంత్‌ కు ముఖ్యం అన్నారు. రాష్ట్రంలో సర్కారు పూర్తిగా గాడి తప్పిందన్నారు. ముఖ్యమంత్రిని ఏ ఒక్క మంత్రి కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మంత్రులు తీరు ఉందన్నారు. రేవంత్‌ కు పాలనపై పట్టు రాలేదని.. అందుకే మంత్రులు సీఎం ను లైట్‌ తీసుకుంటున్నారని చెప్పారు. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సీఎం సీటుపై కన్నేశారని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News