గ్రామ వాలంటీర్లు రిక్షాలు తొక్కాలన్నది అసత్యప్రచారం
రేషన్ షాపు వద్దకు ప్రజలు వచ్చి సరుకులు తీసుకెళ్లే వారని… ఇకపై వాలంటీర్ల ద్వారానే ఇంటింటికి సరఫరా చేస్తామన్నారు పౌరసరఫరాల శాఖ కమిషనర్ శ్రీధర్. అయితే కొందరు ఇలా బియ్యం సరఫరా చేయడానికి గ్రామ వాలంటీర్లు రిక్షాలు తొక్కాల్సి ఉంటుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని… అలాంటిది ఏమీ లేదన్నారు. బియ్యం సరఫరా చేయడానికి వాలంటీర్లు రిక్షాలు తొక్కాలి అనడం పూర్తిగా అవాస్తవమన్నారు. 50 ఇళ్లకు బియ్యాన్ని సరఫరా చేయడానికి 500 రూపాయలు ఇస్తున్నామని… ప్యాకెట్లను ఆటోలతో ఇంటింటికి […]
రేషన్ షాపు వద్దకు ప్రజలు వచ్చి సరుకులు తీసుకెళ్లే వారని… ఇకపై వాలంటీర్ల ద్వారానే ఇంటింటికి సరఫరా చేస్తామన్నారు పౌరసరఫరాల శాఖ కమిషనర్ శ్రీధర్.
అయితే కొందరు ఇలా బియ్యం సరఫరా చేయడానికి గ్రామ వాలంటీర్లు రిక్షాలు తొక్కాల్సి ఉంటుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని… అలాంటిది ఏమీ లేదన్నారు. బియ్యం సరఫరా చేయడానికి వాలంటీర్లు రిక్షాలు తొక్కాలి అనడం పూర్తిగా అవాస్తవమన్నారు.
50 ఇళ్లకు బియ్యాన్ని సరఫరా చేయడానికి 500 రూపాయలు ఇస్తున్నామని… ప్యాకెట్లను ఆటోలతో ఇంటింటికి అందజేస్తామన్నారు. గ్రామ వాలంటీర్లు కేవలం ప్రతి ఇంటి వద్ద ఫింగర్ ఫ్రింట్స్ మాత్రమే తీసుకుంటారన్నారు. చదువుకున్న గ్రామ వాలంటీర్లు రిక్షాలు తొక్కడం లాంటివేమీ చేయాల్సిన అవసరం ఉండదన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దన్నారు.
రేషన్ కార్డు నెంబర్ టైప్ చేయడం ద్వారా రేషన్ ఎప్పటిలోగా వస్తుందన్నది కూడా తెలుసుకునేలా యాప్‌ను రూపొందిస్తున్నామన్నారు. అర్హులైన వారికి సంబంధించిన ఒక్క రేషన్ కార్డును కూడా తొలగించడం లేదన్నారు.