అంతా అమరావతిలోనే ఉండాలంటున్న మేధావులంతా బాబు భక్తులే...

ఏపీ రాజధానిపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. టీడీపీ, దాని అనుబంధ వ్యక్తులు ఒకవైపు… మిగిలిన వారు మరోవైపు అన్నట్టుగా చీలిక వస్తోంది. రాజధాని అంశంపై ఒక టీవీ చానల్ నిర్వహించిన చర్చలో మేధావి చలసాని శ్రీనివాస్‌, టీడీపీ నేత రాజేంద్రప్రసాద్, బీజేపీ నేత పురిఘల రఘురాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాస్‌, బాబు రాజేంద్రప్రసాద్‌లు అమరావతిని కొనసాగించాల్సిందేనని వాదించారు. చంద్రబాబుపై కోపంతో నిర్ణయాలు తీసుకోకుండా జగన్ పరిణితి ప్రదర్శించాలని చలసాని డిమాండ్ చేశారు. కొందరు ఏపీలో […]

Advertisement
Update:2019-08-26 04:40 IST

ఏపీ రాజధానిపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. టీడీపీ, దాని అనుబంధ వ్యక్తులు ఒకవైపు… మిగిలిన వారు మరోవైపు అన్నట్టుగా చీలిక వస్తోంది.

రాజధాని అంశంపై ఒక టీవీ చానల్ నిర్వహించిన చర్చలో మేధావి చలసాని శ్రీనివాస్‌, టీడీపీ నేత రాజేంద్రప్రసాద్, బీజేపీ నేత పురిఘల రఘురాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాస్‌, బాబు రాజేంద్రప్రసాద్‌లు అమరావతిని కొనసాగించాల్సిందేనని వాదించారు.

చంద్రబాబుపై కోపంతో నిర్ణయాలు తీసుకోకుండా జగన్ పరిణితి ప్రదర్శించాలని చలసాని డిమాండ్ చేశారు. కొందరు ఏపీలో ఉంటూ గుజరాత్ పాటలు పాడుతున్నారని చలసాని విమర్శించారు.

ఏపీపై విషం చిమ్మేవారు బీజేపీలో ఉండి చచ్చారు అంటూ మండిపడ్డారు. ఏపీని నాశనం చేయాలని బీజేపీ వారు చూస్తున్నారన్నారు. ఢిల్లీలాంటి రాజధాని కట్టాలని చెప్పిన మోడీ… ఇప్పుడు అందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.

ఇందుకు బీజేపీ నేత పురిఘల రఘురాం తీవ్రంగా స్పందించారు. కొందరు రాజకీయనేతల ముసుగులో, మరికొందరు మేధావుల ముసుగులో చంద్రబాబుపై ప్రేమ ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.

మొత్తం అమరావతిలోనే అభివృద్ధి జరగాలని డిమాండ్ చేస్తున్న వారంతా చంద్రబాబు భక్తులు మాత్రమేనన్నారు. రాజధానికి కేంద్రం ఇచ్చిన సొమ్మును, అప్పుగా తెచ్చిన రెండున్నర లక్షల కోట్లలో రాజధానికి ఎందుకు ఒక్క రూపాయి కూడా చంద్రబాబు ఖర్చు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఐదేళ్ళు ఎందుకు చంద్రబాబు రాజధాని నిర్మించకుండా గ్రాఫిక్స్‌కు పరిమితమయ్యారని నిలదీశారు. ఇలాంటి విషయాల్లో చంద్రబాబును మాత్రం మేధావులు ప్రశ్నించడం లేదని రఘురాం ఎద్దేవా చేశారు.

ఉమ్మడిరాష్ట్రంలో అభివృద్ధిని మొత్తం హైదరాబాద్‌లో పెట్టి ఆంధ్రా ప్రజల గొంతు కోశారని గగ్గొలు పెట్టిన మేధావులు ఇప్పుడెందుకు… మొత్తం అమరావతిలోనే పెట్టాలని కోరుతున్నారని రఘురాం నిలదీశారు.

చంద్రబాబుది అంతా హంగు ఆర్భాటాలతో కూడిన ప్రచారం మాత్రమేనన్నారు. ఢిల్లీలో కూడా పీపుల్స్ కాపిటల్ అంటూ ఫ్లెక్సీలు పెట్టారని… కానీ అమరావతిలో ఇప్పుడు నీరు తప్ప ఏముందని ప్రశ్నించారు.

ఐదేళ్ల పాటు రాజధానిలో పొడుస్తా పొడుస్తా అంటూ బీరాలు పలికిన చంద్రబాబు… చివరకు ప్రజలనే పొడిచాడని రఘురాం మండిపడ్డారు.

అభివృద్ధి వికేంద్రీకరణ జరగకుండా అంతా అమరావతిలోనే పెట్టాలంటున్న వారంతా చంద్రబాబు భక్తులేన్నారు. మొత్తం అభివృద్ధి అమరావతిలోనే కేంద్రీకరించాలన్న ఆలోచనకు బీజేపీ వ్యతిరేకమని రఘురాం స్పష్టం చేశారు.

చంద్రబాబు ఆలోచనకు భిన్నంగా జగన్‌ ఆలోచనలు ఉన్నట్టుగా అనిపిస్తోందన్నారు. కాబట్టి చంద్రబాబు అనుకున్నదేదీ ఇప్పుడు ఏపీలో జరిగే పరిస్థితే ఉండదన్నారు.

Tags:    
Advertisement

Similar News