బాత్ రూంలో బంగారం.... కమోడ్ లో కడ్డీలు

అధికారులు ఎన్ని అడ్డుకట్టలు వేద్దామనుకుంటున్నా… అక్రమ బంగారం దిగుమతి మాత్రం ఆగడం లేదు. ప్రతి రోజూ కిలోల కొద్దీ బంగారం నగరానికి ఏదో ఒక రూపంలో దిగుమతి అవుతూనే ఉంది. ముఖ్యంగా శంషాబాద్ విమానాశ్రంలో నెలలో కనీసం 20 రోజుల్లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు అధికారులు. బంగారాన్ని తరలించేందుకు ప్రయాణీకుల రూపంలో ఉన్న స్మగ్లర్లు ప్రతి సారి ఏదో ఒక కొత్త పద్దతిలో బంగారాన్ని నగరానికి చేరవేస్తున్నారు. తాజాగా ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ […]

Advertisement
Update:2019-08-26 04:38 IST

అధికారులు ఎన్ని అడ్డుకట్టలు వేద్దామనుకుంటున్నా… అక్రమ బంగారం దిగుమతి మాత్రం ఆగడం లేదు. ప్రతి రోజూ కిలోల కొద్దీ బంగారం నగరానికి ఏదో ఒక రూపంలో దిగుమతి అవుతూనే ఉంది.

ముఖ్యంగా శంషాబాద్ విమానాశ్రంలో నెలలో కనీసం 20 రోజుల్లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు అధికారులు. బంగారాన్ని తరలించేందుకు ప్రయాణీకుల రూపంలో ఉన్న స్మగ్లర్లు ప్రతి సారి ఏదో ఒక కొత్త పద్దతిలో బంగారాన్ని నగరానికి చేరవేస్తున్నారు.

తాజాగా ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ లోని కస్టమ్స్ అధికారులు మూడు కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. షార్జీ నుంచి షేక్ అబ్దుల్ సాజిద్ అనే ప్రయాణీకుడు బంగారాన్ని నగరానికి తీసుకువస్తున్నాడని కస్టమ్స్ అధికారులకు పగడ్బందీ సమాచారం అందింది.

దీంతో షార్జా నుంచి వచ్చిన ఇండిగో 6ఈ1406 విమానంలో తనిఖీలు నిర్వహించారు కస్టమ్స్ అధికారులు. విమానంలో తనిఖీ జరగడం, తోటి ప్రయాణీకులను చెక్ చేయడం గమనించిన షేక్ అబ్దుల్ సాజిద్ తన వద్ద ఉన్న బంగారాన్ని బాత్ రూంలోని కమోడ్ లే పడేశాడు.

అయితే ప్రయాణీకులను చెక్ చేయడంతో పాటు…. ప్రశ్నిస్తున్న అధికారులకు సాజిద్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో సాజిద్ ను కస్టమ్స్ అధికారుల వారి స్టైల్ లో ప్రశ్నించడంతో తన వద్ద ఉన్న బంగారాన్ని కమోడ్ లో పడేశానని అసలు విషయం వివరించాడు.

దీంతో బాత్ రూంలోని కమోడ్ లో తనిఖీలు చేపట్టిన అధికారులకు 1.12 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం దొరికింది. మొత్తం 26 బిస్కట్ల రూపంలోను, మరికొంత కడ్డీల రూపంలోను బంగారం పట్టుబడింది.

షార్జీలో ఓ వ్యక్తి బంగారాన్ని సాజిద్ కు ఇచ్చాడని, దానిని అతను చెప్పిన చోటుకు చేరిస్తే లక్షల్లో డబ్బు ఇస్తానని చెప్పడంతో సాజిద్ ఈ పనికి పాల్పడ్డాడని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. స్మగ్లింగ్, అక్రమ రవాణాకు శంషాబాద్ విమానాశ్రయం అడ్డాగా మారిందని పలువురు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News