దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది " నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్

ప్రస్తుతం భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ హెచ్చరించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ వల్ల దేశంలో వ్యాపారాల తీరే మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ ఈ స్థాయి ప్రమాదంలో పడలేదని అభిప్రాయపడ్డారు. వాణిజ్య రంగంలో ఒత్తిడి తగ్గించడానికి కేంద్రం అసాధారణ చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధపడాలన్నారు. ప్రైవేట్‌ రంగం భయంతో ఉందన్నారు. ప్రైవేట్ రంగంలో అప్పులు ఇవ్వడానికి ఎవరూ ముందుకు […]

Advertisement
Update:2019-08-24 04:46 IST

ప్రస్తుతం భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ హెచ్చరించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ వల్ల దేశంలో వ్యాపారాల తీరే మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

దేశ ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ ఈ స్థాయి ప్రమాదంలో పడలేదని అభిప్రాయపడ్డారు.

వాణిజ్య రంగంలో ఒత్తిడి తగ్గించడానికి కేంద్రం అసాధారణ చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధపడాలన్నారు. ప్రైవేట్‌ రంగం భయంతో ఉందన్నారు. ప్రైవేట్ రంగంలో అప్పులు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. అందరూ డబ్బు పోగేసుకుని కూర్చున్నారని వివరించారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నారన్నారు.

ఎవరూ ఎవర్నీ నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు. ఈ పరిస్థితిని మార్చాలన్నారు.

గతంలో బ్యాంకులు ఇష్టానుసారం అప్పులు ఇచ్చాయని… కానీ కంపెనీలు తిరిగి అప్పులు చెల్లించకపోవడంతో అవన్ని నిరర్ధక ఆస్తులుగా మిగిలిపోయాయన్నారు. దేశంలో ఆర్థిక మాంద్యం మొదలైందని రాజీవ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News