ఆస్పత్రిలో చేరిన కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆస్పత్రిలో చేరారు. చాతిలో నొప్పి ఉందంటూ గుంటూరులోని ఆయన అల్లుడికే చెందిన ఆస్పత్రిలో చేరారాయన. ఐసీయూలో ప్రస్తుతం కోడెల ఉన్నారని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. కోడెల కోలుకున్నారని.. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు. కోడెలకు ఇలా చాతీ నొప్పి రావడానికి కారణం ప్రభుత్వ వేధింపులే కారణమని టీడీపీ మీడియా ప్రచారం మొదలుపెట్టింది. అయితే కోడెల స్పీకర్‌గా ఉన్న సమయంలో అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్‌ను దొంగలించిన కోడెల వాటిని తన క్యాంపు […]

Advertisement
Update:2019-08-24 02:50 IST

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆస్పత్రిలో చేరారు. చాతిలో నొప్పి ఉందంటూ గుంటూరులోని ఆయన అల్లుడికే చెందిన ఆస్పత్రిలో చేరారాయన. ఐసీయూలో ప్రస్తుతం కోడెల ఉన్నారని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. కోడెల కోలుకున్నారని.. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు.

కోడెలకు ఇలా చాతీ నొప్పి రావడానికి కారణం ప్రభుత్వ వేధింపులే కారణమని టీడీపీ మీడియా ప్రచారం మొదలుపెట్టింది. అయితే కోడెల స్పీకర్‌గా ఉన్న సమయంలో అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్‌ను దొంగలించిన కోడెల వాటిని తన క్యాంపు ఆఫీస్‌లతో పాటు… కుమారుడికి చెందిన షోరూంలో ఉంచారు. దాంతో నిన్న షోరూంపై అధికారులు దాడులు నిర్వహించారు.

దాడుల్లో గౌతమ్ షోరూంలో భారీగా అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్ ఉండడాన్ని గుర్తించారు. వాటి విలువ కోటి రూపాయలుగా నిర్ధారించారు. ఫర్నిచర్‌ను యూరోపియన్ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇలా దొంగతనం కేసు తన మెడకు చుట్టుకోవడంతో కోడెల ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రయత్నించి ఆస్పత్రిలో చేరినట్టు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News