అధికారులకు చుక్కలు చూపిస్తున్న లోకేష్ బోట్

ప్రకాశం బ్యారేజ్‌ గేటుకు అడ్డంగా ఒక బోట్ ఇరుక్కుపోయింది. వరద సమయంలో ఎగువ నుంచి కొట్టుకొచ్చిన ఈ బోట్ ప్రకాశం బ్యారేజ్‌ గేట్ల మధ్యలో ఇరుక్కుంది. వరద తగ్గిన తర్వాత దాన్ని పక్కకు తొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. వరద తీవ్రత కారణంగా బోట్‌ పూర్తిగా ఇరుక్కుపోయింది. దాంతో సదరు గేట్‌ను మూసివేసేందుకు కూడా వీలు కాకుండాపోయింది. బ్యారేజ్ వద్ద అన్ని గేట్లు మూసినా… పడవ ఇరుక్కున్న గేటు మాత్రం తెరిచే ఉంది. బోటును తొలగించేందుకు […]

Advertisement
Update:2019-08-23 04:31 IST

ప్రకాశం బ్యారేజ్‌ గేటుకు అడ్డంగా ఒక బోట్ ఇరుక్కుపోయింది. వరద సమయంలో ఎగువ నుంచి కొట్టుకొచ్చిన ఈ బోట్ ప్రకాశం బ్యారేజ్‌ గేట్ల మధ్యలో ఇరుక్కుంది. వరద తగ్గిన తర్వాత దాన్ని పక్కకు తొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. వరద తీవ్రత కారణంగా బోట్‌ పూర్తిగా ఇరుక్కుపోయింది. దాంతో సదరు గేట్‌ను మూసివేసేందుకు కూడా వీలు కాకుండాపోయింది.

బ్యారేజ్ వద్ద అన్ని గేట్లు మూసినా… పడవ ఇరుక్కున్న గేటు మాత్రం తెరిచే ఉంది. బోటును తొలగించేందుకు నిన్నంతా ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రయత్నించారు. బ్యారేజ్‌కు ఏమాత్రం డ్యామేజ్ జరగకుండా బోటును తొలగించాల్సి ఉండడంతో పని కష్టంగా మారింది. గ్యాస్‌ కట్టర్లను తెచ్చి పడవను కోసివేసే ప్రయత్నం చేసినా అది పెద్దగా ఫలితం ఇవ్వలేదు. దాంతో ఇతర పద్దతుల్లో దాన్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

పడవ అడ్డుపడ్డ గేటు నుంచి నీరు వృథాగా పోతుండడంతో వీలైనంత త్వరగా దాన్ని తొలగించేందుకు సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బోటుపైనే వరద సమయంలో నారా లోకేష్ ట్వీట్ చేసి అభాసుపాలయ్యారు. తన తండ్రి కరకట్ట ఇంటిని ముంచాలన్న ఉద్దేశంతోనే ప్రకాశం బ్యారేజ్ వద్ద గేటుకు అడ్డుగా పడవను పెట్టారంటే ఒక విచిత్రమైన ట్వీట్‌ను లోకేష్ చేశారు. దాంతో అందరూ నవ్వుకున్నారు.

Tags:    
Advertisement

Similar News