ఒలింపిక్ టెస్ట్ హాకీ ఫైనల్లో భారత్

ఆఖరి రౌండ్లో జపాన్ పై 6-3 గోల్స్ విజయం ఫైనల్లో న్యూజిలాండ్ తో భారత్ అమీతుమీ జపాన్ వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ కు సన్నాహకంగా టోక్యోలో జరుగుతున్న నాలుగుదేశాల ఒలింపిక్ టెస్ట్ హాకీ టోర్నీ ఫైనల్స్ కు ప్రపంచ 5వ ర్యాంకర్ భారత్ చేరుకొంది. నాలుగుజట్ల రౌండ్ రాబిన్ లీగ్ కీలక ఆఖరి రౌండ్ మ్యాచ్ లో భారత్ 6-3 గోల్స్ తో ఆతిథ్య జపాన్ ను చిత్తు చేసింది. భారత ఆటగాడు మన్ దీప్ […]

Advertisement
Update:2019-08-21 05:49 IST
  • ఆఖరి రౌండ్లో జపాన్ పై 6-3 గోల్స్ విజయం
  • ఫైనల్లో న్యూజిలాండ్ తో భారత్ అమీతుమీ

జపాన్ వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ కు సన్నాహకంగా టోక్యోలో జరుగుతున్న నాలుగుదేశాల ఒలింపిక్ టెస్ట్ హాకీ టోర్నీ ఫైనల్స్ కు ప్రపంచ 5వ ర్యాంకర్ భారత్ చేరుకొంది.

నాలుగుజట్ల రౌండ్ రాబిన్ లీగ్ కీలక ఆఖరి రౌండ్ మ్యాచ్ లో భారత్ 6-3 గోల్స్ తో ఆతిథ్య జపాన్ ను చిత్తు చేసింది. భారత ఆటగాడు మన్ దీప్ సింగ్ మూడు గోల్స్ తో హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

మన్ దీప్ సింగ్ ఆట 9, 29, 30 నిముషాలలో గోల్స్ సాధించగా… నీలకంఠ శర్మ, సందీప్, గుర్జంత్ సింగ్ తలో గోల్ సాధించడంతో భారత్ 6-3 గోల్స్ తో విజేతగా నిలువగలిగింది.

జపాన్ తరపున ఫుకూడా, కెంటా తనాకా, కజూమా మురాటా… తలో గోల్ సాధించినా ప్రయోజనం లేకపోయింది.

ఈ టోర్నీ ప్రారంభమ్యాచ్ లో మలేసియాను 6-0తో చిత్తు చేసిన భారత్… రెండో రౌండ్లో మాత్రం న్యూజిలాండ్ చేతిలో 1-2తో ఓటమి చవిచూసినా… ఆఖరి రౌండ్లో పుంజుకొని ఆడి ఫైనల్స్ కు అర్హత సాధించింది.

టైటిల్ సమరంలో న్యూజిలాండ్ పై భారత్ బదులుతీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది.

Tags:    
Advertisement

Similar News