జర్నలిస్టులకు ఫేస్ బుక్ ఆహ్వానం... కారణమిదే

ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంస్కరణల బాట పట్టింది. తన చేతుల్లోని ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఫేక్ న్యూస్ లు ప్రచారంలోకి రావడం.. దాని వల్ల చాలా మందికి అన్యాయం జరగడం.. దాడులకు దిగుతున్న సందర్భాలూ ఉన్నాయి. కొందరు మానసికంగా కూడా నకిలీ వార్తలకు కృంగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫేస్ బుక్ కు భారత సుప్రీం కోర్టు తో సహా ప్రపంచంలోని చాలా కోర్టులు నకిలీ వార్తలను అరికట్టాలని స్పష్టమైన […]

Advertisement
Update:2019-08-21 09:53 IST

ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంస్కరణల బాట పట్టింది. తన చేతుల్లోని ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఫేక్ న్యూస్ లు ప్రచారంలోకి రావడం.. దాని వల్ల చాలా మందికి అన్యాయం జరగడం.. దాడులకు దిగుతున్న సందర్భాలూ ఉన్నాయి. కొందరు మానసికంగా కూడా నకిలీ వార్తలకు కృంగిపోతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఫేస్ బుక్ కు భారత సుప్రీం కోర్టు తో సహా ప్రపంచంలోని చాలా కోర్టులు నకిలీ వార్తలను అరికట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే..

ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ తాజాగా నకిలీ వార్తలకు చెక్ చెప్పడానికి రెడీ అయ్యింది. ఇక నుంచి మనకు ఖచ్చితమైన, వాస్తవికమైన వార్తలను అందించేందుకు నడుం బిగించింది. కొత్త ఫీచర్ లో ‘ఫేస్ బుక్ న్యూస్’ వినియోగదారులను అలరించనుంది.

ఇక ఈ ‘ఫేస్ బుక్ న్యూస్’ కోసం దేశంలోని అన్ని భాషల్లో ప్రముఖ సీనియర్ జర్నలిస్టుల బృందాన్ని నియమించుకోవడానికి ఫేస్ బుక్ రెడీ అయ్యింది.

‘న్యూస్ టాబ్’ ఫీచర్ ను రూపొందించి అందులో అనుభవజ్ఞులైన జర్నలిస్టులతో న్యూస్ లను రాయించి పబ్లిష్ చేస్తారట.. ఈ బృందం విశ్వసనీయ, బ్రేకింగ్, టాప్ వార్తా కథనాలను సరైనవా? కాదా? అని నిర్ధారించుకున్నాకనే వినియోగదారులకు అందిస్తారట.

ఇక ప్రజలు ఫేస్ బుక్ లో సెర్చ్ చేసే న్యూస్ ల ఆధారంగా ఆయా న్యూస్ విస్తృతిని గుర్తించి వినియోగదారులకు ఇవ్వడానికి ఫేస్ బుక్ సిద్ధమైంది. విశ్వసనీయ, మెరుగైన సేవలను అందిస్తూ… నకిలీ న్యూస్ లను అరికట్టేందుకు ఈ కొత్త ”న్యూస్ ఫీచర్” ను లాంచ్ చేస్తున్నామని ఇప్పటికే ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు.

ఫేక్ న్యూస్ లపై వస్తున్న ఒత్తిడి కారణంగా ఈ మేరకు కొత్త న్యూస్ ఫీచర్ ను ఫేస్ బుక్ లో తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News