రాజధాని ముంపుపై విజయసాయిరెడ్డి ట్వీట్

ప్రజలు మునిగిపోయినా పర్వాలేదు… తన అక్రమ కొంప బాగుంటే చాలన్నట్టుగా చంద్రబాబునాయుడి తీరు ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. అమరావతి లోతట్టు ప్రాంతాల్లోకి వరద ప్రవేశించిందన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారని కేంద్రం ఆరా తీస్తుందన్నారు. అమరావతి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. అంతగా సురక్షితం కాని పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారని రేపు కేంద్రం ఆరా తీస్తుంది. ప్రజలూ ప్రశ్నిస్తారు. జవాబు చెప్పలేకే […]

Advertisement
Update:2019-08-20 07:35 IST

ప్రజలు మునిగిపోయినా పర్వాలేదు… తన అక్రమ కొంప బాగుంటే చాలన్నట్టుగా చంద్రబాబునాయుడి తీరు ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

అమరావతి లోతట్టు ప్రాంతాల్లోకి వరద ప్రవేశించిందన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారని కేంద్రం ఆరా తీస్తుందన్నారు.

అందుకు జవాబు చెప్పలేకే…. చంద్రబాబు తన నివాసాన్ని వరదలో ముంచారంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అండ్ టీంను ”తీసేసిన తాసిల్దార్లు” అంటూ సంబోధించారు.

ఎగువ నుంచి వచ్చే వరదను అంచనా వేసి… కిందకు ఎంత వదలాలి అన్నది ఇంజనీర్లు నిర్ణయిస్తారని… కానీ చంద్రబాబు మాత్రం ప్రజలు బలైపోయినా పర్వాలేదు… తన అక్రమ కొంప మునగడానికి వీల్లేదంటూ కుట్ర కథనాలను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు.

టీడీపీ నుంచి బీజేపీలో చేరుతున్న నేతలు ఒక్కరు కూడా చంద్రబాబును విమర్శించడం లేదని… దీన్ని బట్టే ఇదంతా చంద్రబాబు కనసన్నల్లోనే జరుగుతున్నట్టుగా స్పష్టమవుతోందన్నారు.

Tags:    
Advertisement

Similar News