అసెంబ్లీ కంప్యూటర్లు, ఫర్నీచర్ దొంగిలించిన కోడెల
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలుసుకుని టీడీపీ నేతలు కూడా కంగుతింటున్నారు. కోడెల శివప్రసాదరావు ఎందుకు ఇంతగా దిగజారిపోయారని టీడీపీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. తాను స్పీకర్‌గా ఉన్న సమయంలో అసెంబ్లీకి సంబంధించిన కంప్యూటర్లు, విలువైన ఫర్నిచర్‌ను స్పీకర్ కోడెల కాజేశారు. ఈ విషయం కొత్త ప్రభుత్వం పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఏపీ అసెంబ్లీని అమరావతికి తరలించే సమయంలో హైదరాబాద్‌లో ఉన్న కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను లారీల్లో తరలించారు. ఆసమయంలో […]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలుసుకుని టీడీపీ నేతలు కూడా కంగుతింటున్నారు.
కోడెల శివప్రసాదరావు ఎందుకు ఇంతగా దిగజారిపోయారని టీడీపీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. తాను స్పీకర్‌గా ఉన్న సమయంలో అసెంబ్లీకి సంబంధించిన కంప్యూటర్లు, విలువైన ఫర్నిచర్‌ను స్పీకర్ కోడెల కాజేశారు. ఈ విషయం కొత్త ప్రభుత్వం పరిశీలనలో వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లోని ఏపీ అసెంబ్లీని అమరావతికి తరలించే సమయంలో హైదరాబాద్‌లో ఉన్న కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను లారీల్లో తరలించారు. ఆసమయంలో కొన్ని లారీలను నేరుగా కోడెల తన ఇంటికి మళ్లించారు. గుంటూరు, సత్తెనపల్లిలోని తన నివాసంలో కంప్యూటర్లు, విలువైన ఫర్నిచర్ ఉంచుకున్నారు. ప్రభుత్వం మారినా సరే ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా కోడెల మౌనంగా ఉంటూ వచ్చారు.
ఇటీవల అసెంబ్లీ అధికారులు హైదరాబాద్ నుంచి వచ్చిన కంప్యూటర్లు, ఫర్నిచర్ గురించి పరిశీలన చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తరలింపు సమయంలో స్పీకర్ కోడెల నేరుగా తన ఇంటికి లారీలను మళ్లించారని కొందరు ఉప్పందించారు. తొలుత ఈ విషయంపై అసెంబ్లీ సెక్రటరీ లేఖ రాసినా కోడెల స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు.
దాంతో రంగప్రవేశం చేసిన పోలీసులు కోడెల ఇంటికి వెళ్లి పరిశీలించగా ఫర్నిచర్, కంప్యూటర్లు ఉన్నట్టు తేలింది. దాంతో కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.