‘నిజాం’బాద్ తో అరిష్టం... పేరు మార్చేస్తాం...
తెలంగాణలో కమల ఉత్సాహం కనిపిస్తోంది. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తెలంగాణకు వచ్చి నిర్వహించిన సభతో ఉత్సాహంగా ఉన్నారు బీజేపీ నేతలు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి చేరికలు ఉంటాయని ప్రకటించారు. అన్నట్టుగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తాజాగా ఒక ప్రకటన చేశారు. టీఆర్ఎస్ ఎంపీ బీజేపీలో చేరబోతున్నారంటూ బాంబు పేల్చారు. అయితే బీజేపీలో చేరబోతున్నది లోక్ సభ ఎంపీ కాదు.. రాజ్యసభ ఎంపీ. అదీ నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ తండ్రి […]
తెలంగాణలో కమల ఉత్సాహం కనిపిస్తోంది. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తెలంగాణకు వచ్చి నిర్వహించిన సభతో ఉత్సాహంగా ఉన్నారు బీజేపీ నేతలు.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి చేరికలు ఉంటాయని ప్రకటించారు. అన్నట్టుగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తాజాగా ఒక ప్రకటన చేశారు. టీఆర్ఎస్ ఎంపీ బీజేపీలో చేరబోతున్నారంటూ బాంబు పేల్చారు.
అయితే బీజేపీలో చేరబోతున్నది లోక్ సభ ఎంపీ కాదు.. రాజ్యసభ ఎంపీ. అదీ నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ తండ్రి అని తేలింది. టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీగా ఉంటూ టీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ధర్మపురి శ్రీనివాస్ బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది.
తాజాగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. తనను నమ్మి బీజేపీలో చేరుతున్న తండ్రి డీఎస్ కు, ఆయన అనుచర వర్గానికి బీజేపీ భరోసానిస్తుందని హామీ ఇచ్చారు. నిజామాబాద్ లో అసలు కాంగ్రెస్సే లేదని, నాయకుడే లేడని స్పష్టం చేశారు..
ఇక నిజామాబాద్ పేరు మార్చే యోచనలో ఉన్నట్టు అరవింద్ తేల్చిచెప్పారు. నిజామాబాద్ లో నిజాం ఉన్నాడని.. దీన్ని ప్రజలు అరిష్టంగా భావిస్తున్నారని ఆయన అన్నారు. నిజాం సాగర్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ… ఇలా అన్నీ నిజాం పేరుతో ఉన్నందునే నిండకుండా మూతపడి పోతున్నాయని.. వెంటనే జిల్లాకు ‘ఇందూరు’గా పేరు మారుస్తామని స్పష్టం చేశారు.