బాబుకు ఆ సూచన మాత్రం ఇవ్వని పవన్
పవన్ కల్యాణ్ ఓ పంథానా అంతుపట్టరు. మాటల్లో ఉన్నంత ఆదర్శం… చేతల్లో కనిపించడం లేదు. తాను తటస్తుడిని అని పవన్ కల్యాణ్ ఎన్నిసార్లు చెప్పినా చంద్రబాబుపై అభిమానాన్ని మాత్రం ఏదో ఒక రూపంలో ప్రదర్శిస్తూనే ఉంటారు. కృష్ణమ్మ చంద్రబాబు ఉంటున్న లింగమనేని భవనాన్ని చుట్టుముట్టిన నేపథ్యంలో ఆ ఇంటిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అక్రమ కట్టడాన్ని నిర్మించి బాబుకు అప్పగించిన లింగమనేని రమేష్… పవన్ కల్యాణ్‌కు కూడా బలమైన స్నేహితుడు అన్న విషయం ఇక్కడ అందరికీ […]
పవన్ కల్యాణ్ ఓ పంథానా అంతుపట్టరు. మాటల్లో ఉన్నంత ఆదర్శం… చేతల్లో కనిపించడం లేదు. తాను తటస్తుడిని అని పవన్ కల్యాణ్ ఎన్నిసార్లు చెప్పినా చంద్రబాబుపై అభిమానాన్ని మాత్రం ఏదో ఒక రూపంలో ప్రదర్శిస్తూనే ఉంటారు.
కృష్ణమ్మ చంద్రబాబు ఉంటున్న లింగమనేని భవనాన్ని చుట్టుముట్టిన నేపథ్యంలో ఆ ఇంటిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
అక్రమ కట్టడాన్ని నిర్మించి బాబుకు అప్పగించిన లింగమనేని రమేష్… పవన్ కల్యాణ్‌కు కూడా బలమైన స్నేహితుడు అన్న విషయం ఇక్కడ అందరికీ తెలిసిందే.
ఇలా చంద్రబాబు ఇంటిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుండడంతో, నది చుట్టుముట్టినా చంద్రబాబు ఎందుకు ఆ ఇంటిని ఖాళీ చేయకుండా పట్టుకుని వేలాడుతున్నారని సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ స్పందించారు.
టీడీపీని తమలపాకుతో కొట్టి, ప్రభుత్వాన్ని మాత్రం తీవ్రంగా విమర్శించారు. డ్రోన్ రాజకీయాలు మాని వరద బాధితులకు ప్రభుత్వం సాయం చేయాలని కోరారు. కరకట్టపై ఒక్క చంద్రబాబు ఇళ్లే కాదు చాలా మంది పెద్దల ఇళ్ళు ఉన్నాయని లేఖలో గుర్తు చేశారు. వరద వస్తే అవి మునిగితే మునుగుతాయి… మంత్రులకెందుకు ఉత్సాహం అని తనలోని భావనలను పరోక్షంగా పవన్ పలికించారు.
ఇంత లేఖ రాసి… ఎక్కడా కూడా అసలు నది గర్భంలో అక్రమంగా నిర్మించిన ఇంటిలో ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఎలా ఉంటున్నారని మాత్రం పవన్ కల్యాణ్ ప్రశ్నించలేదు.
ప్రకృతి అంటే తనకు ఇష్టమని పలుమార్లు చెప్పుకున్న పవన్… నదిలోకి వెళ్లి అక్రమంగా ఇల్లు నిర్మించిన లింగమనేనిని పల్లెత్తు మాట అనడం లేదు. వరద వస్తే చంద్రబాబు ఇల్లు మునిగితే మునుగుతుంది … లేదంటే లేదు… మీకెందుకు అత్యుత్సాహం అని మంత్రులనే ప్రశ్నించడం ద్వారా పవన్‌కల్యాణ్‌కు చంద్రబాబు ఇల్లు కృష్ణా గర్భంలో ఉండడం పట్ల అభ్యంతరం లేదనిపిస్తోంది.
ఇక డ్రోన్ రాజకీయాలు ఆపండి మాజీ ముఖ్యమంత్రి ఇంటిని ముంచేస్తారా అని ప్రతిపక్షం, మునిగిందా లేదా అని చూసేందుకు అధికార…
Posted by JanaSena Party on Saturday, 17 August 2019