అక్కా చెల్లెళ్లకు సీఎం జగన్ రాఖీ వరాలు

రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. స్వాతంత్ర్యదినోత్సవం, రాఖీ పౌర్ణమి ఒకే రోజున రావడంతో విజయవాడలో దేశ పతాకాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర్రంలోమహిళలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మందికి ఒక్కో కుటుంబానికి సెంటున్నర స్థలం ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ” ఉగాది నాటికి అక్కాచెల్లెళ్లందరికీ వారి పేరు […]

Advertisement
Update:2019-08-15 09:08 IST

రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. స్వాతంత్ర్యదినోత్సవం, రాఖీ పౌర్ణమి ఒకే రోజున రావడంతో విజయవాడలో దేశ పతాకాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర్రంలోమహిళలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మందికి ఒక్కో కుటుంబానికి సెంటున్నర స్థలం ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు.

” ఉగాది నాటికి అక్కాచెల్లెళ్లందరికీ వారి పేరు మీద సెంటున్నర స్ధలం ఇస్తాం. ఇది మహిళలకు నేను ఇస్తున్న కానుక” అని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు.

అధికారంలోకి వచ్చిన రెండో సంవత్సరంలో డ్వాక్రా మహిళలకు నాలుగు దఫాలుగా రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు మేమున్నామని వై.ఎస్.ఆర్. భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

రాష్ట్ర్రంలో 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలందరికీ ఆర్థిక సాయం అందజేస్తున్నామని సీఎం చెప్పారు. దేశంలోనే తొలిసారిగా చట్టసభలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది తమ ప్రభుత్వమేనని అన్నారు.

ఇక రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో రైతులకు 84 వేల కోట్ల రూపాయల పంట రుణాలను అందజేస్తున్నామని, కౌలు రైతులకు కూడా ఈ సాయాన్ని అందిస్తున్న ప్రభుత్వం తమదే అన్నారు.

ఇక దేశంలోనే మొదటిసారిగా పోలీసులకు వీక్లీఆఫ్ ను ప్రకటించి దానిని అమలు చేస్తున్నది తమ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

అలాగే తమ పాలనకు దేవుడి ఆశీసులు కూడా తోడవుతున్నాయని, రాష్ట్రంలో శ్రీశైలం, పులిచింతలతో పాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయన్నారు.

“రాష్ట్ర్రంలో జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి. ఇందుకు దేవుడికి వినమ్రంగా నమస్సులు తెలియజేసుకుంటున్నాను” అని అన్నారు. ప్రజా సమస్యలను వారి నుంచే నేరుగా తెలుసుకునేందుకు స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించామని, దానిని తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నానని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో త్వరలో అర్చకులు, ఫాస్టర్లను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తాము ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో ప్రకటించినవన్నీ అమలు చేస్తున్నామని, ఉద్యోగులకు హామీ ఇచ్చినట్లుగా పాత ఫించను విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

అంతకు ముందు ముఖ్యమంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని అందుకున్నారు. ఈ స్వాతంత్ర్య వేడుకలకు రాష్ట్ర మంత్రులతో పాటు వైఎస్ విజయమ్మ, మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మతో పాటు ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

Tags:    
Advertisement

Similar News