'ఇస్కాన్‌' నేత చిన్మోయ్‌ కృష్ణదాస్‌ అరెస్ట్‌

ఇస్కాన్‌కు చెందిన చిన్మోయ్‌ కృష్ణదాస్‌ గత నెలలో బంగ్లాదేశ్‌ జెండాపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్‌

Advertisement
Update:2024-11-26 12:50 IST

ఇస్కాన్‌కు చెందిన చిన్మోయ్‌ కృష్ణదాస్‌ ప్రభును బంగ్లాదేశ్‌లోని ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఆయనను విడిపించాలని ఇస్కాన్‌ ఆలయ అధికారులు కోరారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

ఇస్కాన్‌కు చెందిన చిన్మోయ్‌ కృష్ణదాస్‌ ను బంగ్లాదేశ్‌లోని ఢాకా పోలీసులు అరెస్టు చేశారనే వార్తలు మేము చూశాం. అక్కడి అధికారులు ఇస్కాన్‌పై తప్పుడు ఆరోపణలు చేశారు. దీనిపై భారత ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. బంగ్లాదేశ్‌ ప్రభుత్వంతో మాట్లాడి.. మాది శాంతి, ప్రేమగల భక్తి ఉద్యమం అని తెలియజేయాలి. కృష్ణదాస్‌ను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నామని రాసుకొచ్చారు.

బంగ్లాదేశ్‌ మీడియా కథనం ప్రకారం.. ఇస్కాన్‌కు చెందిన చిన్మోయ్‌ కృష్ణదాస్‌ గత నెలలో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన బంగ్లాదేశ్‌ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనను ఢాకా విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఆయన అరెస్టును వ్యతిరేకిస్తూ పలు సంఘాలు ఆందోళన చేపట్టాయి.

Tags:    
Advertisement

Similar News