దోపిడి లేని సమాజం నిర్మిస్తాం " ఏపీ సీఎం జగన్
ప్రభుత్వానికి ఆదాయం కావాలా? ప్రజలు ఆరోగ్యంగా ఉండడం కావాలా ? అంటే తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం వైపే నిలుస్తుందన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అందుకోసమే గ్రామాల్లో బెల్ట్ షాపులను లేకుండా చేశామన్నారు. అక్టోబర్ నుంచి మద్యం షాపులను నేరుగా ప్రభుత్వమే నడిపేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయిస్తూ చట్టం తెచ్చామన్నారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ […]
ప్రభుత్వానికి ఆదాయం కావాలా? ప్రజలు ఆరోగ్యంగా ఉండడం కావాలా ? అంటే తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం వైపే నిలుస్తుందన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అందుకోసమే గ్రామాల్లో బెల్ట్ షాపులను లేకుండా చేశామన్నారు.
అక్టోబర్ నుంచి మద్యం షాపులను నేరుగా ప్రభుత్వమే నడిపేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయిస్తూ చట్టం తెచ్చామన్నారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఆయన ఆవిష్కరించారు.
ఎలాంటి విలువలు లేని గత ప్రభుత్వం తరహాలో రాజకీయాలు చేద్దామా? లేక వ్యవస్థను మారుద్దామా ?అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రతి పనిలో పారదర్శకత ఉండాలన్న ఉద్దేశంతోనే టెండర్ల ఖరారు కోసం జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏ ప్రభుత్వ శాఖ అయినా సరే కోటి రూపాయలకు మించి కొనుగోలు చేస్తే ఆ వివరాలను ఆన్‌లైన్లో ఉంచుతున్నామని చెప్పారు.
ల్యాండ్ మాఫియాలను, అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టేలా చట్టం తెచ్చామన్నారు. రైతులు సంక్షోభంలో ఉన్న సమయంలో వ్యవసాయ వృద్ధి రేటు పెరిగిందని చెప్పడం రైతులను అవమానించడమే అవుతుందన్నారు.
గోదావరి జలాలను నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించడం ద్వారా కృష్ణా డెల్టాను స్థిరీకరించడంతో పాటు కరువుతో అల్లాడుతున్న రాయలసీమకు నీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు స్పందన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్న తొలి ప్రభుత్వం తమదేనన్నారు. పాల రైతులకు లీటర్‌కు అదనంగా 4 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు.
రైతులకు, పేదలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కరెంట్ చార్జీలు తగ్గించాల్సిందిగా కంపెనీలను అడుగుతుంటే… కొందరు హాహాకారాలు చేస్తున్నారని జగన్ విమర్శించారు.
ఎక్కువ ధరకు కోడ్ చేసిన కాంట్రాక్టు పనులను తక్కువ ధరకే చేయించేందుకు ప్రయత్నిస్తుంటే గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. ఒకరిని మరొకరు దోచుకునే అవకాశం లేని సమసమాజం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.