పథకాల అమలుపై యాక్షన్ ప్లాన్ ప్రకటించిన జగన్
సంక్షేమ పథకాల అమలుపై యాక్షన్ ప్లాన్‌ను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈనెల 15న గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించనున్నారు. విజయవాడలో ముఖ్యమంత్రి గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభిస్తారు. నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల చేత గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుడుతారు. ఆగస్ట్ 16 నుంచి 23 వరకు వాలంటీర్లు తమకు కేటాయించిన ఇళ్లపై అవగాహన కోసం తిరుగుతారు. […]
సంక్షేమ పథకాల అమలుపై యాక్షన్ ప్లాన్‌ను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈనెల 15న గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించనున్నారు. విజయవాడలో ముఖ్యమంత్రి గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభిస్తారు. నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల చేత గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుడుతారు.
ఆగస్ట్ 16 నుంచి 23 వరకు వాలంటీర్లు తమకు కేటాయించిన ఇళ్లపై అవగాహన కోసం తిరుగుతారు.
ఆగస్ట్ 26 నుంచి 30 వరకు గ్రామాల్లో ఇళ్ల పట్టాలు లేని లబ్ధిదారుల కోసం సర్వే నిర్వహిస్తారు.
సెప్టెంబర్ 1 నుంచి శ్రీకాకుళంలో నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తారు.
సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు పించన్ల డోర్ డెలివరీ కార్యక్రమం నిర్వహిస్తారు.
సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు కొత్త పించన్లు, రేషన్ కార్డుల జారీ కార్యక్రమం ఉంటుంది.
మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న గ్రామ సచివాలయాలను ప్రారంభించనున్నారు.