పేకాటరాయుళ్ల అరెస్ట్‌ ఎపిసోడ్ పై.... పవన్ కల్యాణ్ సీరియస్

రాజోలు నియోజకవర్గంలోని మలికిపురంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆగ్రహించిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌…. జనసేన కార్యకర్తలతో కలిసి వెళ్లి స్టేషన్‌పై దాడి చేశారు. జనసేన కార్యకర్తలు స్టేషన్‌పై రాళ్లు రువ్వి, పర్నిచర్ ధ్వంసం చేశారు. స్టేషన్‌పై దాడి పట్ల సీరియస్‌గా స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు ఎమ్మెల్యేతో పాటు మరో 15 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాపాక స్వయంగా వెళ్లి స్టేషన్‌లో లొంగిపోయారు. ఇలా పేకాట […]

Advertisement
Update:2019-08-13 10:51 IST

రాజోలు నియోజకవర్గంలోని మలికిపురంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆగ్రహించిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌…. జనసేన కార్యకర్తలతో కలిసి వెళ్లి స్టేషన్‌పై దాడి చేశారు. జనసేన కార్యకర్తలు స్టేషన్‌పై రాళ్లు రువ్వి, పర్నిచర్ ధ్వంసం చేశారు.

స్టేషన్‌పై దాడి పట్ల సీరియస్‌గా స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు ఎమ్మెల్యేతో పాటు మరో 15 మందిపై కేసులు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాపాక స్వయంగా వెళ్లి స్టేషన్‌లో లొంగిపోయారు. ఇలా పేకాట రాయుళ్ల అరెస్ట్‌కు నిరసనగా స్టేషన్‌పై దాడి ఎపిసోడ్‌పై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.

జనసేన ఎమ్మెల్యేపై నాన్ బెయిలబుల్ కేసులు ఎలా పెడుతారని ప్రశ్నించారు. ప్రజలు అడగడం వల్లే పోలీస్ స్టేషన్ వద్దకు ఎమ్మెల్యే వెళ్లారని వివరించారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తీసుకొచ్చారన్నారు.

పరిస్థితులు అదుపు తప్పితే తానే స్వయంగా రాజోలు వస్తానని … ఇది శాంతిభద్రతల అంశంగా మారకుండా పోలీసులే పరిష్కరించాలని పవన్‌ కల్యాణ్ హెచ్చరించారు.

జర్నలిస్ట్ ను బెదిరించిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఎందుకు కేసులు పెట్టలేదని (నిజానికి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై జర్నలిస్ట్ ను బెదిరించిన వ్యవహారంలో ఇప్పటికే కేసు నమోదైంది…) పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News