భారత చీఫ్ కోచ్ రేస్ లో ఆరుస్తంభాలాట

ముగ్గురు విదేశీ కోచ్ లతో రవి శాస్త్రి పోటీ ఆగస్టు 16 నుంచి చీఫ్ కోచ్ ఇంటర్వ్యూలు ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు..చీఫ్ కోచ్ ఎంపికను అట్టహాసంగా నిర్వహిస్తోంది. గత రెండేళ్లుగా భారతజట్టుకు ప్రధాన శిక్షకుడిగా సేవలు అందించిన రవి శాస్త్రి పదవీ కాలం గతనెలలోనే ముగిసినా…కరీబియన్ టూర్ కోసం 45 రోజులపాటు కాంట్రాక్టు పొడిగించినా… సరికొత్త చీఫ్ కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వనించింది. భారతజట్టు చీఫ్ కోచ్ పదవితో పాటు సహాయక సిబ్బంది పోస్టుల కోసం […]

Advertisement
Update:2019-08-13 07:22 IST
  • ముగ్గురు విదేశీ కోచ్ లతో రవి శాస్త్రి పోటీ
  • ఆగస్టు 16 నుంచి చీఫ్ కోచ్ ఇంటర్వ్యూలు

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు..చీఫ్ కోచ్ ఎంపికను అట్టహాసంగా నిర్వహిస్తోంది. గత రెండేళ్లుగా భారతజట్టుకు ప్రధాన శిక్షకుడిగా సేవలు అందించిన రవి శాస్త్రి పదవీ కాలం గతనెలలోనే ముగిసినా…కరీబియన్ టూర్ కోసం 45 రోజులపాటు కాంట్రాక్టు పొడిగించినా… సరికొత్త చీఫ్ కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వనించింది.

భారతజట్టు చీఫ్ కోచ్ పదవితో పాటు సహాయక సిబ్బంది పోస్టుల కోసం మొత్తం 2వేల దరఖాస్తులు బీసీసీఐకి చేరాయి.
చీఫ్ కోచ్ రేస్ లో ముగ్గురు భారతీయలు, ముగ్గురు విదేశీయులు పోటీపడుతున్నారు.

ముగ్గురు సభ్యుల కమిటీదే తుది నిర్ణయం….

భారత క్రికెట్ చీఫ్ కోచ్ ఎంపిక కోసం…కపిల్ దేవ్ నేతృత్వంలో అంశుమాన్ గయక్వాడ్, శాంతా రంగస్వామి సభ్యులుగా ముగ్గురు సభ్యుల కమిటీని భారత క్రికెట్ పాలకమండలి నియమించింది.

ఆగస్టు 16 నుంచి జరిగే ఇంటర్వ్యూల కోసం మొత్తం ఆరుగురు అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరిలో ప్రస్తుత చీఫ్ కోచ్ రవి శాస్త్రి,
భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ రాబిన్ సింగ్, లాల్ చంద్ రాజ్ పుట్ తో పాటు… టామ్ మూడీ, మైక్ హెస్సెన్, ఫిల్ సిమ్మన్స్ ఉన్నారు.

భారత క్రికెట్ ప్రమాణాలు పెంచడం కోసం తమ వద్ద ఉన్న ప్రణాళికలను ఈ ఆరుగురు అభ్యర్థులు..ఎంపిక సంఘం ముందు
వివరించాల్సి ఉంది.

చీఫ్ కోచ్ గా ఎంపికైన అభ్యర్థికి ఏడాదికి 7 కోట్ల 50 లక్షల రూపాయల వేతనంతో పాటు రెండేళ్ల కాంట్రాక్టు ఇవ్వనున్నారు.

Tags:    
Advertisement

Similar News