గోరంట్ల మాధవ్‌ వైసీపీకి ఇబ్బందులు తెస్తున్నారా?

గోరంట్ల మాధవ్‌. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో సీఐ. ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయనపై అనేక తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎన్నోసార్లు మొమోలు జారీ అయ్యాయి. నోట్ల రద్దు సమయంలో రామ్మోహన్ రెడ్డి అనేక ఒక ఉద్యోగిని విచక్షణ రహితంగా కొట్టిన తీరు చూసి రాష్ట్రం దిగ్బ్రాంతి చెందింది. పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న ఒక ఒంట విషయంలోనూ మాధవ్ తీరు అప్పట్లో దుమారం రేపింది. పెళ్లికొడుకును లాకప్‌లో వేసి చితకబాదాడన్న ఆరోపణలపై ఆయన చర్యలకు గురయ్యారు. […]

Advertisement
Update:2019-08-13 07:24 IST

గోరంట్ల మాధవ్‌. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో సీఐ. ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయనపై అనేక తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎన్నోసార్లు మొమోలు జారీ అయ్యాయి. నోట్ల రద్దు సమయంలో రామ్మోహన్ రెడ్డి అనేక ఒక ఉద్యోగిని విచక్షణ రహితంగా కొట్టిన తీరు చూసి రాష్ట్రం దిగ్బ్రాంతి చెందింది.

పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న ఒక ఒంట విషయంలోనూ మాధవ్ తీరు అప్పట్లో దుమారం రేపింది. పెళ్లికొడుకును లాకప్‌లో వేసి చితకబాదాడన్న ఆరోపణలపై ఆయన చర్యలకు గురయ్యారు. అంతకు ముందు కూడా చిన్నచిన్న తప్పులకే సామాన్యులను నడిరోడ్లపై కొట్టుకుంటూ తీసుకెళ్లిన ట్రాక్ రికార్డు మాధవ్‌ కు ఉంది.

నాటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మీసం తిప్పడం ద్వారా హాట్ టాపిక్ అయ్యారు. అంతలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించి గోరంట్ల మాధవ్‌కు హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీగా గెలిచారు. ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత కూడా తీరులో మార్పు రాలేదన్న విమర్శలు వస్తున్నాయి.

ఉద్దేశాలు మంచివే అయినా గోరంట్ల మాధవ్ వ్యవహార శైలి మాత్రం అత్యంత వివాదాస్పదంగా ఉందంటున్నారు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కూడా ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే పలుమార్లు అధికారులపై దాడి చేశారని… కానీ దాని వల్ల ఏం జరిగిందో అందరికీ తెలుసని గుర్తు చేస్తున్నారు.

గోరంట్ల మాధవ్ ఎంపీ అయిన తర్వాత ఇప్పటికే రెండు సార్లు వివాదాస్పద అంశాలతో వార్తల్లోకి ఎక్కారు. కియాలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వని మాట వాస్తవమే. స్థానికులకు నైపుణ్యం లేకపోవడం వల్లే ఉద్యోగాలు ఇవ్వకపోకపోయామని కియా చెబుతోంది. అయితే తొలి కారు ప్రారంభోత్సవం సందర్భంగా గోరంట్ల మాధవ్ వ్యవహరించిన తీరు ఎంపీ స్థాయికి తగ్గట్టుగా లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి.

కియా సిబ్బందికి వేలు చూపిస్తూ వార్నింగ్‌లు ఇవ్వడం, ఆ ఫోటో పత్రికల్లో ప్రచురితం కావడం, ప్రతిపక్షం దీనిపై ప్రభుత్వాన్ని నిలదీయడం వైసీపీకి ఇబ్బందిగా మారింది. పరిశ్రమలు ఏర్పాటు చేసిన వారిని ఇలా బహిరంగంగానే హెచ్చరిస్తే ఇక కొత్తగా పారిశ్రామికవేత్తలు ముందుకెలా వస్తారని వైసీపీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది మరకముందే… డ్యూటీలో ఉన్న సీఐను ఒరేయ్ అంటూ ఎంపీ పిలవడంపైనా చర్చ జరుగుతోంది. ఒక కార్యక్రమానికి హాజరైన గోరంట్ల మాధవ్‌… కార్యక్రమ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన సీఐ మురళీధర్‌ రెడ్డిని ఒరేయ్ ఇక్కడికి రారా… వచ్చి కూర్చో అంటూ ఆహ్వానించారు.

నిజానికి మురళీధర్‌, గోరంట్ల మాధవ్‌లు గతంలో సీఐలుగా ఉన్నప్పుడు స్నేహితులు. ఆ చొరవతోనే సీఐ మురళీధర్ రెడ్డిని ఒరేయ్ అని ఎంపీ సంబోధించారు. కాకపోతే యూనిఫాంలో ఉన్న సీఐను ఒరేయ్ అని పిలవడం ద్వారా తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావన వ్యక్తమవుతోంది.

ఒక ఎంపీ… డ్యూటీలో ఉన్న ఒక సీఐను ఒరేయ్ అని పిలిచిన తర్వాత పోలీసులు అందరి పట్ల సమంగా వ్యవహరించలేరన్న అభిప్రాయం ప్రజల్లో కలిగే అవకాశం ఉంటుందంటున్నారు. డ్యూటీలో ఉన్న సీఐను ఒరేయ్ అంటూ… ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ పిలవడంపై పోలీసు ఉన్నతాధికారులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News