టీడీపీ ఓటమికి కారణం అవినీతి, బంధుప్రీతి.... గోరంట్ల సంచలన కామెంట్స్‌

గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఆరు సార్లు టీడీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యే. అంతేకాదు.. ప్రస్తుతం అసెంబ్లీలో చంద్రబాబు తర్వాత శాసనసభా ప్రతిపక్ష ఉపనేత. అలాంటి నేత తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో మంగళవారం జరుగుతున్న టీడీపీ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన ఓ తెలుగు న్యూస్ చానెల్ తో మాట్లాడారు. టీడీపీ ఓటమిపై గోరంట్ల సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఓడిపోవడానికి అసలు కారణం మంత్రులు, జిల్లా, మండల […]

Advertisement
Update:2019-08-13 08:39 IST

గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఆరు సార్లు టీడీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యే. అంతేకాదు.. ప్రస్తుతం అసెంబ్లీలో చంద్రబాబు తర్వాత శాసనసభా ప్రతిపక్ష ఉపనేత. అలాంటి నేత తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గుంటూరులో మంగళవారం జరుగుతున్న టీడీపీ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన ఓ తెలుగు న్యూస్ చానెల్ తో మాట్లాడారు.

టీడీపీ ఓటమిపై గోరంట్ల సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఓడిపోవడానికి అసలు కారణం మంత్రులు, జిల్లా, మండల స్థాయి నేతలేనని కుండబద్దలు కొట్టారు. వాళ్లు అవినీతి, బంధుప్రీతి, జనంతో సక్రమంగా వ్యవహరించని కారణంగానే ఈ ఓటములు ఎదురవుతున్నాయని గోరంట్ల హాట్ కామెంట్ చేశారు. ఇప్పటికైనా టీడీపీలో ఉన్న తెల్ల ఏనుగులు లాంటి నేతలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన సంచలన కామెంట్ చేశారు.

ఇక సీనియర్లను సాగనంపి టీడీపీకి యువరక్తాన్ని ఎక్కించాలని.. యువతకు అవకాశాలు ఇస్తేనే టీడీపీ బాగుపడుతుందని గోరంట్ల సూచించారు. అందుకే తాను వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోనని ప్రకటించారు.

ఇప్పటికే ఆరు సార్లు గెలిచిన తాను యువతకు అవకాశం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. తప్పొప్పులను బేరేజు వేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని గోరంట్ల బుచ్చయ్య కోరారు.

ఇక చంద్రబాబు…. పార్టీ, ప్రభుత్వ పదవుల విషయంలో పారదర్శకత పాటించాల్సిన అవసరం ఉందని బుచ్చయ్య చౌదరి సుతిమెత్తగా హెచ్చరించారు.

దీన్ని బట్టి పీఏసీ చైర్మన్ గా పయ్యావుల నియామకాన్ని బుచ్చయ్య వ్యతిరేకిస్తున్నట్లుగా…. పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

మొత్తంగా వచ్చే ఎన్నికల్లో పోటీచేయనని… మంత్రులు, కింది స్థాయి నేతల వల్లే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓడిందని బుచ్చయ్య చౌదరి సంచలన కామెంట్స్ చేశారు.

Tags:    
Advertisement

Similar News