చెన్నైలో దారుణం... నలుగురు అనాథ బాలికలపై అత్యాచారం
అనాథలైన ఆ బాలికల ఆలనాపాలనా చూడాల్సిన సంరక్షకుడే కర్కోటకుడిగా మారాడు. కామంతో కళ్లు మూసుకొని పోయి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణం తమిళనాడులో చోటు చేసుకుంది. మధురై జిల్లా సమయనల్లూరు ప్రాంతంలో ‘మాసా ట్రస్టు’ ఒక అనాథ బాలికల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఈ కేంద్రాన్ని కరమాత్తూరుకు చెందిన జ్ఞాన ప్రకాశం, ఆదిముత్తు అనే వ్యక్తులు నిర్వహిస్తున్నారు. కాగా, ఇక్కడ ఉండే బాలికలపై లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని జిల్లా బాలల […]
అనాథలైన ఆ బాలికల ఆలనాపాలనా చూడాల్సిన సంరక్షకుడే కర్కోటకుడిగా మారాడు. కామంతో కళ్లు మూసుకొని పోయి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణం తమిళనాడులో చోటు చేసుకుంది.
మధురై జిల్లా సమయనల్లూరు ప్రాంతంలో ‘మాసా ట్రస్టు’ ఒక అనాథ బాలికల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఈ కేంద్రాన్ని కరమాత్తూరుకు చెందిన జ్ఞాన ప్రకాశం, ఆదిముత్తు అనే వ్యక్తులు నిర్వహిస్తున్నారు. కాగా, ఇక్కడ ఉండే బాలికలపై లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని జిల్లా బాలల సంక్షేమ కార్యాలయానికి పిర్యాదులు అందాయి.
ఈ పిర్యాదులపై విచారణ జరపడానికి జిల్లా బాలల సంక్షేమ కమిటీ సభ్యుడు షణ్ముగం వెళ్లారు. ఆ విచారణలో నలుగురు అనాథ బాలికలపై నిర్వాహకుడు ఆది శివన్ అత్యాచారం చేశాడని బాలికలు తెలిపారు. తమపై జరిగిన దారుణాన్ని వివరించి వారు కంటతడి పెట్టుకున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు బాధిత బాలికలు చెప్పారు.
దీంతో విచారణ సభ్యుడు షణ్ముగం పోలీసులకు పిర్యాదు చేయడంతో ఆదిశివన్‌ను అరెస్టు చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితులను ముధురై ముత్తుపట్టిలో ఉండే బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. మరోవైపు పోలీసులు మరో నిర్వాహకుడు జ్ఞానప్రకాశంను విచారిస్తున్నారు.