15 ఏళ్ళ క్రితం మరణించి బతికి వచ్చింది
అది 5 ఫిబ్రవరి, 2005. గుజరాత్ లోని పలవ అనే గ్రామం. రాత్రి 11 గంటలకు తమ నాలుగేండ్ల మనుమడు యశ్ పాల్ గుక్కపట్టి ఏడుస్తుంటే నిద్ర లేచారు నానమ్మ, తాతయ్యలు. పిల్లవాడి పక్కన ఉండాల్సిన కోడలు భిఖి కనపడక పోవడం తో వెతికారు. తెల్లవారిన తర్వాత పొలం లో ఓ 24 ఏళ్ళ యువతి శవం ఆ రాత్రి…. భిఖి కట్టుకున్న చీర తో కనిపించింది. అయితే శవం ముఖం గుర్తుపట్టలేనంతగా కాలి ఉంది. అది […]
అది 5 ఫిబ్రవరి, 2005. గుజరాత్ లోని పలవ అనే గ్రామం. రాత్రి 11 గంటలకు తమ నాలుగేండ్ల మనుమడు యశ్ పాల్ గుక్కపట్టి ఏడుస్తుంటే నిద్ర లేచారు నానమ్మ, తాతయ్యలు. పిల్లవాడి పక్కన ఉండాల్సిన కోడలు భిఖి కనపడక పోవడం తో వెతికారు. తెల్లవారిన తర్వాత పొలం లో ఓ 24 ఏళ్ళ యువతి శవం ఆ రాత్రి…. భిఖి కట్టుకున్న చీర తో కనిపించింది.
అయితే శవం ముఖం గుర్తుపట్టలేనంతగా కాలి ఉంది. అది భిఖి శవమే అని భావించి పోలీసులు అత్త మామలను, ఆడబిడ్డను అరెస్టు చేశారు. భిఖి భర్త ప్రకాష్ ముంబైలో ఓ ఫ్యాక్టరీ లో వెల్డర్ గా పనిచేస్తున్నాడు.
కోర్టులో సాక్ష్యాలు లేని కారణం గా నిర్దోషులుగా బయటపడినా… తన తల్లిదండ్రులు అవమాన భారం వల్ల తొందరగా చనిపోయారని ప్రకాష్ అంటున్నాడు. భార్య భిఖి మరణించిన 14 ఏండ్లకు పోలీసుల నుంచి ఓ రాత్రి ప్రకాష్ కి ఫోన్ వచ్చింది. అతడి భార్య బతికే వుందని, అమెను గుర్తించడానికి ఓ ఫొటో వాట్స్ యాప్ చెయ్యమనేది ఫోన్ సారాంశం.
ప్రకాష్ కుటుంబ సభ్యులు గుర్తింపు పెరేడ్ కి వెళ్ళారు. అక్కడ భిఖి తన భర్తను దూరం నుంచే గుర్తించి పోలీసులతో చెప్పింది. బలహీనంగా ఉన్న భార్యను కష్టం మీద గుర్తించాడు ప్రకాష్. ఆమెను చూసి విస్మయానికి గురయ్యాడు. 14 ఏళ్ళ క్రితం చనిపోయిన భార్య ఎట్లా బతికివచ్చింది?
అసలేం జరిగిందంటే…
భిఖి తన ప్రేమికుడైన విజూభా రాథోర్ తో వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని ఓ డ్రామా కి తెర తీసింది. మతి స్థిమితం
లేని తన ఈడు ఉన్న ఒక అనాథ యువతిని, తన ప్రియుడు, అతని ఫ్రెండ్స్ మరో ముగ్గురితో కలిసి చంపి, కిరోసిన్ తో ముఖాన్ని గుర్తుపట్టలేనంతగా కాల్చింది.
అత్తగారి ఊరికి 50 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఒక పట్టణం లో భావనా రాథోర్ అనే పేరుతో కాపురం పెట్టింది. ప్రియుడు ఈ మధ్య ఒక దొంగతనం కేసులో పట్టుపడటం తో అసలు కథ బయట పడింది.
రహస్యంగా ప్రియునితో జీవించడం విసుగెత్తించిందని, జైల్లో ఉండటానికైనా సిద్ధమని అసలు ముద్దాయి భిఖి అనడం కొసమెరుపు.