బందోబస్తులో ఉన్న సీఐని ఒరేయ్ అని పిలిచిన ఎంపీ.... ఎందుకో తెలుసా?

ఆయన కొత్తగా గెలిచిన ఎంపీ. వన సమారాధనకు ముఖ్య అతిథిగా పిలవడంతో ఆ కార్యక్రమానికి వెళ్లారు. తీరా అక్కడకు వెళ్లాక బందోబస్తులో ఉన్న సీఐని చూసి.. ఒరేయ్ అంటూ పిలిచాడు. కాని ఆ సీఐ ఏ మాత్రం బాధపడకుండా వెళ్లి ఆ ఎంపీని కౌగిలించుకున్నాడు. ఈ దృశ్యం చూసిన అక్కడి వాళ్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అసలు ఆ ఎంపీ ఎవరు..? ఆ సీఐని ఎందుకు ఒరేయ్ అన్నాడు.. అయినా ఆ సీఐ ఎందుకు కోప్పడలేదని అనుకుంటున్నారా..? హిందూపురం […]

Advertisement
Update:2019-08-12 18:06 IST

ఆయన కొత్తగా గెలిచిన ఎంపీ. వన సమారాధనకు ముఖ్య అతిథిగా పిలవడంతో ఆ కార్యక్రమానికి వెళ్లారు. తీరా అక్కడకు వెళ్లాక బందోబస్తులో ఉన్న సీఐని చూసి.. ఒరేయ్ అంటూ పిలిచాడు. కాని ఆ సీఐ ఏ మాత్రం బాధపడకుండా వెళ్లి ఆ ఎంపీని కౌగిలించుకున్నాడు. ఈ దృశ్యం చూసిన అక్కడి వాళ్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అసలు ఆ ఎంపీ ఎవరు..? ఆ సీఐని ఎందుకు ఒరేయ్ అన్నాడు.. అయినా ఆ సీఐ ఎందుకు కోప్పడలేదని అనుకుంటున్నారా..?

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనంతపురంలో జరిగిన ఒక వన సమారాధనకు వెళ్లారు. అక్కడ వేదిక మీదకు వెళ్లాక సీఐ మురళీధర్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు గమనించారు. సభ ప్రారంభానికి ముందు మాధవ్ గట్టిగా.. ఒరేయ్ మురళీధర్.. ఇక్కడికి రారా అంటూ పిలిచారు. దీంతో అందరూ అవాక్కయ్యారు. మురళీధర్ వెంటనే ఎంపీ దగ్గరకు వెళ్లారు. తన దగ్గరకు వచ్చిన సీఐని గట్టిగా హత్తుకొని పక్కనే కూర్చోబెట్టుకున్నారు.

నా ప్రాణ స్నేహితుడిని నాకు బందోబస్తుగా ఏర్పాటు చేయడం ఏంటీ..? నాకు మురళీ 1998 నుంచి స్నేహితుడని.. ఎన్నో ప్రమోషన్లను అతను మిస్ అయ్యాడని ఎంపీ మాధవ్ అన్నారు. తన స్నేహితుడు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మురళీ కూడా కోరుకున్నారు. ఈ సన్నివేశం అక్కడ ఎంతో విశేషంగా ఆకట్టుకుంది.

Tags:    
Advertisement

Similar News