కరీబియన్ క్రికెట్లో గేల్ రికార్డు

లారాను అధిగమించిన జమైకన్ థండర్ 300 వన్డేల్లో 10వేల 350 పరుగులు జమైకన్ థండర్, విండీస్ వండర్ ఓపెనర్ క్రిస్ గేల్ …కరీబియన్ క్రికెట్లో రికార్డుల మోత మోగించాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగో లోని క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియం వేదికగా భారత్ తో ముగిసిన రెండోవన్డేలో 11 పరుగులు సాధించడం ద్వారా ఈ ఘనత సంపాదించాడు. లాయిడ్, గ్రీనిడ్జ్, వీవీ రిచర్డ్స్‌, రిచీ రిచర్డ్స్ సన్, బ్రయన్ లారా లాంటి ఎందరో దిగ్గజాలకు దక్కని రికార్డులను క్రిస్ […]

Advertisement
Update:2019-08-12 08:10 IST
  • లారాను అధిగమించిన జమైకన్ థండర్
  • 300 వన్డేల్లో 10వేల 350 పరుగులు

జమైకన్ థండర్, విండీస్ వండర్ ఓపెనర్ క్రిస్ గేల్ …కరీబియన్ క్రికెట్లో రికార్డుల మోత మోగించాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగో లోని క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియం వేదికగా భారత్ తో ముగిసిన రెండోవన్డేలో 11 పరుగులు సాధించడం ద్వారా ఈ ఘనత సంపాదించాడు.

లాయిడ్, గ్రీనిడ్జ్, వీవీ రిచర్డ్స్‌, రిచీ రిచర్డ్స్ సన్, బ్రయన్ లారా లాంటి ఎందరో దిగ్గజాలకు దక్కని రికార్డులను క్రిస్ గేల్ సాధించాడు. అత్యధిక వన్డేలు, అత్యధిక వన్డే పరుగులు సాధించిన విండీస్ ఒకే ఒక్క క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.

బ్రయన్ లారా పేరుతో ఉన్న 299 వన్డేలు, 10 వేల 348 పరుగుల రికార్డులను గేల్ తెరమరుగు చేశాడు. లారా మొత్తం 295 ఇన్నింగ్స్ లో 19 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు సాధించాడు.

1999 టు 2019..

1999 లో భారత్ ప్రత్యర్థిగా టొరాంటో వేదికగా వన్డే అరంగేట్రం చేసిన గేల్ గత దశాబ్దకాలంలో ప్రస్తుత సిరీస్ లోని రెండో వన్డే వరకూ 300 మ్యాచ్ లు ఆడి 293 ఇన్నింగ్స్ లో 10 వేల 408 పరుగులు సాధించాడు.

ఇందులో 25 సెంచరీలు, 53 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 326 సిక్సర్లతో వీరబాదుడు మొనగాడిగా నిలిచాడు.

తొలి డబుల్ హీరో…

వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ బాదిన ఏకైక కరీబియన్ క్రికెటర్ గా క్రిస్ గేల్ నిలిచాడు. జింబాబ్వే ప్రత్యర్థిగా సాధించిన 215 పరుగులే గేల్ కు అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.

ప్రస్తుత భారత్ సిరీస్ తో గేల్ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News