ఫెదరర్, జోకోలను అధిగమించిన నడాల్

ఏటీపీ మాస్టర్స్ ఫైనల్లో నడాల్ సరికొత్త రికార్డు అమెరికన్ ఓపెన్ కు సన్నాహకంగా జరుగుతున్న ఏటీపీ టూర్ మాంట్రియెల్ మాస్టర్స్ ఫైనల్స్ కు చేరడం ద్వారా స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ టెన్నిస్ పురుషుల విభాగంలో ప్రధాన ప్రత్యర్దులు రోజర్ ఫెదరర్, నొవాక్ జోకోవిచ్ ల రికార్డును అధిగమించాడు. కెనడాలోని మాంట్రియెల్ వేదికగా జరుగుతున్న రోజర్స్ కప్ మాస్టర్స్ టోర్నీ సెమీస్ లో ప్రత్యర్థి మోన్ ఫిల్స్ గాయంతో ఉపసంహరించుకోడంతో.. నడాల్ ఏమాత్రం చెమటోడ్చకుండానే ఫైనల్స్ […]

Advertisement
Update:2019-08-11 10:14 IST
  • ఏటీపీ మాస్టర్స్ ఫైనల్లో నడాల్ సరికొత్త రికార్డు

అమెరికన్ ఓపెన్ కు సన్నాహకంగా జరుగుతున్న ఏటీపీ టూర్ మాంట్రియెల్ మాస్టర్స్ ఫైనల్స్ కు చేరడం ద్వారా స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ప్రపంచ టెన్నిస్ పురుషుల విభాగంలో ప్రధాన ప్రత్యర్దులు రోజర్ ఫెదరర్, నొవాక్ జోకోవిచ్ ల రికార్డును అధిగమించాడు. కెనడాలోని మాంట్రియెల్ వేదికగా జరుగుతున్న రోజర్స్ కప్ మాస్టర్స్ టోర్నీ సెమీస్ లో ప్రత్యర్థి మోన్ ఫిల్స్ గాయంతో ఉపసంహరించుకోడంతో.. నడాల్ ఏమాత్రం చెమటోడ్చకుండానే ఫైనల్స్ చేరుకోగలిగాడు.

తన కెరియర్ లో ఇప్పటికే నాలుగుసార్లు మాంట్రియెల్ మాస్టర్స్ టైటిల్ నెగ్గిన నడాల్ ఐదో టైటిల్ కు గెలుపు దూరంలో నిలిచాడు.

అంతేకాదు.. ఏటీపీ టూర్ మాస్టర్స్ 1000 సిరీస్ ఫైనల్స్ కు నడాల్ 51వసారి చేరడం ద్వారా రోజర్ ఫెదరర్ పేరుతో ఉన్న 50 ఫైనల్స్ రికార్డును తెరమరుగు చేశాడు.

ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జోకోవిచ్ కు మాస్టర్స్ 1000 సిరీస్ ఫైనల్స్ కు 49 సార్లు చేరిన రికార్డు మాత్రమే ఉంది.
మాస్టర్స్ ఫైనల్స్ చేరడంలో ఫెదరర్, జోకోవిచ్ ల రికార్డులను అధిగమించిన నడాల్…టైటిల్ సమరంలో రష్యా ఆటగాడు డేనెల్లీ మెద్వదేవ్ తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

Tags:    
Advertisement

Similar News