సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టుకు నీరు విడుదల అయ్యింది. ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి నాగార్జున సాగర్ ఎడమ కాలువ దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ కు చేరుకున్న మంత్రులు సంయుక్తంగా నీటిని విడుదల చేశారు. సాగర్ లో నీరు పుష్కలంగా ఉండటంతో ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించాయి. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… నాగార్జున […]

Advertisement
Update:2019-08-11 17:23 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టుకు నీరు విడుదల అయ్యింది. ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి నాగార్జున సాగర్ ఎడమ కాలువ దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ కు చేరుకున్న మంత్రులు సంయుక్తంగా నీటిని విడుదల చేశారు.

సాగర్ లో నీరు పుష్కలంగా ఉండటంతో ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించాయి. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… నాగార్జున సాగర్ రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో నిండుతుందని అందుకే నీటిని విదుదల చేయడానికి పూనుకున్నామని అన్నారు.

మంచి వ్యక్తులు కలిసినప్పుడు చిన్న చిన్న విషయాలపై తాగాదాలు పెట్టుకోకుండా సంయమనంతో ముందుకు సాగుతారని…. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ విధంగానే వ్యవహరిస్తున్నాయని మంత్రి అన్నారు. ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా కలిసి మెలిసి తెలుగు రాష్ట్రాల రెండు ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయని మంత్రి అనిల్ కుమార్ అన్నారు.

గోదావరి నీటి విషయంలో కూడా రెండు రాష్ట్రాలు ఇదేవిధంగా వ్యవహరించాలని అన్నారు. తాగునీటికి, సాగునీటికి ఇబ్బంది పడకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును చూసి జనం అభినందిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News