అసెంబ్లీ సీట్ల పెంపుపై మళ్లీ ఆశలు !

కేంద్రం మరో ముందడుగు వేయబోతోందా? మరో విభజన హామీ నెరవేర్చబోతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో అసెంబ్లీ సీట్ల పెంపుపై ఇక్కడ ఆశలు మొదలయ్యాయి. జమ్మూకశ్మీర్ ను కేంద్రం రెండు ముక్కలు చేసింది. జమ్మూకశ్మీర్ ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా చేసింది. లడఖ్ ను పూర్తిస్థాయి కేంద్ర పాలిత ప్రాంతం చేసింది. జమ్మూకాశ్మీర్ పునర్విభజనతో […]

Advertisement
Update:2019-08-06 04:45 IST

కేంద్రం మరో ముందడుగు వేయబోతోందా? మరో విభజన హామీ నెరవేర్చబోతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో అసెంబ్లీ సీట్ల పెంపుపై ఇక్కడ ఆశలు మొదలయ్యాయి.

జమ్మూకశ్మీర్ ను కేంద్రం రెండు ముక్కలు చేసింది. జమ్మూకశ్మీర్ ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా చేసింది. లడఖ్ ను పూర్తిస్థాయి కేంద్ర పాలిత ప్రాంతం చేసింది. జమ్మూకాశ్మీర్ పునర్విభజనతో అక్కడ అసెంబ్లీ సీట్ల మార్పు జరుగుతోంది. త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉన్నందున సీట్ల పెంపు, మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ సీట్ల పెంపు, మార్పులు చేర్పులతో పాటే తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లును కూడా కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు ప్రతిపాదన హోంశాఖ దగ్గర పెండింగ్ లో ఉంది. ఈ ప్రతిపాదనను హోంశాఖ పరిశీలిస్తోంది. విభజన చట్టంలోనూ ఈ ప్రస్తావన ఉంది.

అయితే బీజేపీ నేతలు మాత్రం అసెంబ్లీ సీట్ల పెంపుపై హింట్ ఇస్తున్నారు. ఏపీ, తెలంగాణలలో ఇప్పట్లో ఎన్నికలు లేవని… వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదని బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహరావు అన్నారు.

ఈ ప్రభుత్వ టర్మ్ ముగిసేలోపు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు జరుగుతుందని చెప్పారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లోపు సీట్ల పెంపు ఉంటుందని ప్రధాన పార్టీల నేతలు ఆశలు పెట్టుకున్నారు.

Tags:    
Advertisement

Similar News