ఆ ఇద్దరికి.... మంత్రి పదవులు కట్ !
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై మళ్లీ ఊహగానాలు మొదలయ్యాయి. ఈ నెల లేదా వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ విస్తరణలో కొత్తవారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. నలుగురికి మంత్రులుగా చాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. మాజీమంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లకు బెర్త్ లు ఖాయమని తెలుస్తోంది. మెదక్ జిల్లా నుంచి ఇప్పటివరకూ మంత్రి ఎవరూ లేరు. హరీష్ రావుకు చాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు మరో ఇద్దరు లేదా […]
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై మళ్లీ ఊహగానాలు మొదలయ్యాయి. ఈ నెల లేదా వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ విస్తరణలో కొత్తవారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. నలుగురికి మంత్రులుగా చాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది.
మాజీమంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లకు బెర్త్ లు ఖాయమని తెలుస్తోంది. మెదక్ జిల్లా నుంచి ఇప్పటివరకూ మంత్రి ఎవరూ లేరు. హరీష్ రావుకు చాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు మరో ఇద్దరు లేదా ముగ్గురికి మంత్రులుగా అవకాశం ఇస్తారని సమాచారం.
నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ కాబోతున్నారు. ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని గులాబీ వర్గాల మాట.
ఆయనతో పాటు పాతరంగారెడ్డి జిల్లా నుంచి సబితా ఇంద్రారెడ్డికి బెర్త్ ఖాయం. రెడ్డి సామాజిక వర్గంలో వీరిద్దరికి చోటు దక్కితే… ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న ఇద్దరు రెడ్డి మంత్రులను తొలగిస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం కేబినెట్ లో ఐదుగురు రెడ్లు మంత్రులుగా ఉన్నారు. నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి ఉన్నారు. అయితే వీరిలో ఇద్దరిని తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు కేబినెట్ విస్తరణ జరిగితే ఓ ఎస్టీ ఎమ్మెల్యేతో పాటు మహిళకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. కేబినెట్ లో మున్నూరు కాపు నుంచి మంత్రి పదవి దక్కలేదు. ప్రస్తుతం ఏడుగురు ఎమ్మెల్యేలు ఆ సామాజిక వర్గం నుంచి ఎన్నికయ్యారు. నిజామాబాద్ ఎన్నికలతో పాటు గత పార్లమెంట్ ఎన్నికల ఫలితాల నేపథ్యంతో వారిలో ఒకరికి చాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.