ఫేక్ కంపెనీ పేరుతో 1000 ఎకరాలకు ఎర్త్
ఏపీలో పరిశ్రమల కోసం భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే సహింబోమన్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. పరిశ్రమల్లో ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన నైపుణ్యంపై స్థానిక నిరుద్యోగులకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఇందుకు ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో ఒక్కో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టుచెప్పారు. కేవలం సర్టిఫికేట్ల వల్ల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఏపీకి చెందిన పిల్లలను టెక్నాలజీ, ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు […]
ఏపీలో పరిశ్రమల కోసం భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే సహింబోమన్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. పరిశ్రమల్లో ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన నైపుణ్యంపై స్థానిక నిరుద్యోగులకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఇందుకు ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో ఒక్కో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టుచెప్పారు.
కేవలం సర్టిఫికేట్ల వల్ల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఏపీకి చెందిన పిల్లలను టెక్నాలజీ, ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు ఈ శిక్షణా కేంద్రాల ద్వారా సిద్దం చేస్తామని చెప్పారు.
నెల్లూరులో మీడియాతో మాట్లాడిన గౌతమ్ రెడ్డి… కొందరు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని భూములు తీసుకుని వాటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని వాటిని వెనక్కు తీసుకుంటామని చెప్పారు. టీడీపీ హయాంలో భూముల కేటాయింపు ఎంత లోపభూయిష్టంగా జరిగిందో వివరించేందుకు ఒక ఉదాహరణ కూడా చెప్పారు గౌతమ్ రెడ్డి.
తిరుపతి సమీపంలో పరిశ్రమ ఏర్పాటుకు 1000 ఎకరాలు ఇవ్వాల్సిందిగా గత ప్రభుత్వానికి రిలయన్స్ సంస్థ పేరుతో దరఖాస్తు వచ్చింది. ఈ ఫైల్ గత టీడీపీ ప్రభుత్వ కేబినెట్ ఆమోదం కోసం కూడా వెళ్లింది. ఆరా తీయగా ఇది అంబానీలు నడుపుతున్న రిలయన్స్ కంపెనీ కాదు అని తేలినట్టు గౌతమ్ రెడ్డి వివరించారు. అదో ఫేక్ కంపెనీగా నిర్ధారించామని… రిలయన్స్ పేరుతో భూములు కొట్టేసేందుకు ప్రయత్నించారని వివరించారు. ఇలాంటివి ఇంకా ఏమైనా ఉంటే పరిశీలన చేస్తామని వెల్లడించారు.