పడిలేచిన కెరటం స్టీవ్ స్మిత్
ఏడాది సస్పెన్షన్ తర్వాత తొలిటెస్టులోనే శతకం యాషెస్ సిరీస్ లో స్మిత్ వీరోచిత సెంచరీ టెస్ట్ క్రికెట్ ప్రపంచ మాజీ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్, ఆస్ట్ర్రేలియా స్టార్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు. బాల్ టాంపరింగ్ ఆరోపణలతో ఏడాది నిషేధం కారణంగా క్రికెట్ కు దూరమైన స్మిత్…సంవత్సరం తర్వాత ఆడిన తొలిటెస్టులోనే హీరోచిత సెంచరీ సాధించి వారేవ్వా అనిపించుకొన్నాడు. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ కమ్ యాషెస్ సిరీస్ తొలిటెస్టులోనే స్టీవ్ స్మిత్ […]
- ఏడాది సస్పెన్షన్ తర్వాత తొలిటెస్టులోనే శతకం
- యాషెస్ సిరీస్ లో స్మిత్ వీరోచిత సెంచరీ
టెస్ట్ క్రికెట్ ప్రపంచ మాజీ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్, ఆస్ట్ర్రేలియా స్టార్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు.
బాల్ టాంపరింగ్ ఆరోపణలతో ఏడాది నిషేధం కారణంగా క్రికెట్ కు దూరమైన స్మిత్…సంవత్సరం తర్వాత ఆడిన తొలిటెస్టులోనే
హీరోచిత సెంచరీ సాధించి వారేవ్వా అనిపించుకొన్నాడు.
ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ కమ్ యాషెస్ సిరీస్ తొలిటెస్టులోనే స్టీవ్ స్మిత్ ఫైటింగ్ సెంచరీతో తన జట్టును ఆదుకొన్నాడు.
బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న తొలిటెస్టు తొలిరోజు ఆటలో తనజట్టు పీకలోతు కష్టాలలో కూరుకుపోయినా…స్మిత్ మాత్రం
ఒంటరిగా పోరాడుతూ… లోయర్ఆర్డర్ ఆటగాళ్లు పీటర్ సిడిల్, నేథన్ లయన్ ల తోడ్పాటుతో కీలక భాగస్వామ్యాలు నమోదు
చేయటమే కాదు… ఓ అసాధారణ శతకం పూర్తి చేశాడు.
కెరియర్ లో 24వ శతకం…
ఆస్ట్ర్రేలియా రెండోడౌన్ ఆటగాడిగా బ్యాటింగ్ కు దిగిన స్మిత్ మొత్తం 219 బాల్స్ ఎదుర్కొని 16 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 144 పరుగులు సాధించాడు. స్మిత్ కెరియర్ లో ఇదే అత్యుత్తమ యాషెస్ సెంచరీ కావడం విశేషం. అంతేకాదు…ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లో శతకం బాదిన తొలి క్రికెటర్ ఘనతను స్మిత్ సొంతం చేసుకొన్నాడు.
తన కెరియర్ లో కేవలం 65వటెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడిన 30 ఏళ్ల స్మిత్ కు 24 శతకాలు, 24 అర్థశతకాలు సాధించిన రికార్డు ఉంది.
ఇంగ్లండ్ ప్రత్యర్థిగా స్టీవ్ స్మిత్ కు ఇది తొమ్మిదో సెంచరీ కావడం విశేషం.
బాల్ టాంపరింగ్ వివాదంతో కెప్టెన్సీని కోల్పోయిన స్మిత్…ఏడాది నిషేధం శిక్షను సైతం భరించి…రీ-ఎంట్రీలో సైతం తన సత్తా ఏపాటిదో విమర్శకులకు చాటి చెప్పాడు.