చాముండీకి ఈడీ నోటీసులు

ఇటీవల అరెస్ట్‌ అయిన సానా సతీష్ విచారణలో పలువురి పేర్లు బయటపెట్టారు. సానా ఇచ్చిన సమాచారం ఆధారంగా కాంగ్రెస్‌ నేత షబ్బీర్ అలీ, సుఖేష్ గుప్తా, రమేష్‌, వ్యాపారవేత్త చాముండీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. మాంసం వ్యాపారి మొయిన్‌ ఖురేషీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో సతీష్‌ నిందితుడిగా ఉన్నాడు. 2013లో వజ్రాల వ్యాపారీ సుఖేష్‌ బెయిల్‌ కోసం మాంసం వ్యాపారీ మొయిన్‌ ఖురేషీకి సానా రూ. కోటీ 50లక్షలు ఇచ్చారని కేసు నమోదయింది. సుఖేష్‌ బెయిల్‌ […]

Advertisement
Update:2019-08-03 07:18 IST

ఇటీవల అరెస్ట్‌ అయిన సానా సతీష్ విచారణలో పలువురి పేర్లు బయటపెట్టారు. సానా ఇచ్చిన సమాచారం ఆధారంగా కాంగ్రెస్‌ నేత షబ్బీర్ అలీ, సుఖేష్ గుప్తా, రమేష్‌, వ్యాపారవేత్త చాముండీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. మాంసం వ్యాపారి మొయిన్‌ ఖురేషీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో సతీష్‌ నిందితుడిగా ఉన్నాడు.

2013లో వజ్రాల వ్యాపారీ సుఖేష్‌ బెయిల్‌ కోసం మాంసం వ్యాపారీ మొయిన్‌ ఖురేషీకి సానా రూ. కోటీ 50లక్షలు ఇచ్చారని కేసు నమోదయింది.

సుఖేష్‌ బెయిల్‌ కోసం షబ్బీర్‌ అలీ, ఖురేషీ, సానా సీబీఐ కార్యాలయానికి వెళ్లారని విచారణలో తేలినట్లు సమాచారం.

సానాతో సంబంధాలున్నట్టు నిర్ధారణ కావడంతో మరో ఇద్దరు తెలుగు ప్రముఖులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. షబ్బీర్ అలీ మాత్రం తనకు ఎలాంటి నోటీసులు రాలేదని చెబుతున్నాడు.

Tags:    
Advertisement

Similar News