అడక్కపోయినా మంత్రికి ముడుపులు.... వెనక్కు పంపిన వైనం
ఏపీలో కొత్త మంత్రులకు వింతవింత అనుభవాలు ఎదురవుతున్నాయి. ఆ మధ్య విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పోస్టు కోసం మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు ఏకంగా ఒక అధికారి కోటి రూపాయలు లంచం ఇచ్చేందుకు వచ్చారు. అయితే మంత్రి వాయించి పంపించారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాతే సబ్ రిజిస్ట్రార్ల బదిలీలో నిబంధనలను గట్టిగా అమలు చేశారు. ఇప్పుడు ఏపీలో మరో శాఖ మంత్రికి అదే తరహా అనుభవం ఎదురైంది. కీలక శాఖకు మంత్రిగా […]
ఏపీలో కొత్త మంత్రులకు వింతవింత అనుభవాలు ఎదురవుతున్నాయి. ఆ మధ్య విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పోస్టు కోసం మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు ఏకంగా ఒక అధికారి కోటి రూపాయలు లంచం ఇచ్చేందుకు వచ్చారు. అయితే మంత్రి వాయించి పంపించారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాతే సబ్ రిజిస్ట్రార్ల బదిలీలో నిబంధనలను గట్టిగా అమలు చేశారు.
ఇప్పుడు ఏపీలో మరో శాఖ మంత్రికి అదే తరహా అనుభవం ఎదురైంది. కీలక శాఖకు మంత్రిగా ఉన్న ఆయనకు నెలకు రెండు కోట్ల రూపాయల మేర ముడుపులు వచ్చాయి. దాంతో మంత్రి ఆశ్చర్యపోయారు. తాను ఎవరినీ అడగలేదు … ఈ డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించగా… అధికారులు తల గోక్కున్నారు.
ఇది కామన్ సర్… మీరు అడిగినా అడగకపోయినా నెలనెల కింద నుంచి అధికారులు ఇలా మంత్రులకు డబ్బులు పంపిస్తారంటూ సెలవిచ్చారు. దాంతో మంత్రికి కాళ్లు చేతులు వణికిపోయాయట.
ఈ విషయం ముఖ్యమంత్రికి తెలిస్తే నేనేమైపోవాలి అంటూ అధికారులను నిలదీశారని చెబుతున్నారు. దాంతో అధికారులు కూడా కంగుతిన్నారు. ఏమో సర్.. గతంలో మంత్రులకు ఇలాగే చేశాం… మీరు ఇలా అంటారని ఊహించలేదంటూ సొమ్మును వెనక్కు తీసుకెళ్లారని చెబుతున్నారు.