అబ్బో.... మళ్లీ వేశాడు నాని

ఐదేళ్ల నుంచి ఎంపీగా ఉన్నారు. అది కూడా అధికార పార్టీ ఎంపీగా. కానీ విజయవాడలో ఒక ఫ్లై ఓవర్‌ను పూర్తి చేయలేక ప్రజలతో ముఖాన…. అధికార పార్టీ నేతలతో పాటు తిట్టించుకున్నారు. ఐదేళ్లలో ఏమీ చేయకపోయినా కొత్త ప్రభుత్వంపై మాత్రం రెండు నెలల్లోనే అన్నీ ఎందుకు చేయడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ట్విట్టర్‌ అకౌంట్‌ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకున్నారో ఏమో గానీ… నిత్యం కేశినేని నాని ట్విట్టర్ నుంచి రెట్టలు జాలువారుతున్నాయి. […]

Advertisement
Update:2019-07-31 05:49 IST

ఐదేళ్ల నుంచి ఎంపీగా ఉన్నారు. అది కూడా అధికార పార్టీ ఎంపీగా. కానీ విజయవాడలో ఒక ఫ్లై ఓవర్‌ను పూర్తి చేయలేక ప్రజలతో ముఖాన…. అధికార పార్టీ నేతలతో పాటు తిట్టించుకున్నారు. ఐదేళ్లలో ఏమీ చేయకపోయినా కొత్త ప్రభుత్వంపై మాత్రం రెండు నెలల్లోనే అన్నీ ఎందుకు చేయడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.

ట్విట్టర్‌ అకౌంట్‌ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకున్నారో ఏమో గానీ… నిత్యం కేశినేని నాని ట్విట్టర్ నుంచి రెట్టలు జాలువారుతున్నాయి.

ఒక్కోసారి ఒక్కొక్కరిని గెలకడం తిరిగి వారు వాయిస్తే సమాధానం చెప్పలేక ముడుచుకుపోవడం కేశినేని నానికి కామన్ అయిపోయింది.

తాజాగా మరోసారి ముఖ్యమంత్రిపై ట్వీట్ చేశారు నాని. ఐదేళ్లు ఎంపీగా ఉండి ఏమీ ఎలగబెట్టలేకపోయినప్పటికీ… ఇప్పుడు బెంజ్‌ సర్కిల్ ఫైఓవర్ నిర్మాణం మీకు చేతనవుతుందా లేదా అని ముఖ్యమంత్రిని నాని ప్రశ్నించారు. ఒకవేళ చేతగాకుంటే చెప్పండి… నేను చేసి చూపిస్తా అంటూ సవాల్ చేశారు నాని.

ఐదేళ్లు అధికారంలో ఉండి కనకదుర్గ ఫైఓవర్‌ను గట్టెక్కించలేకపోయిన కేశినేని నాని… రెండు నెలలు కూడా పూర్తి గాని ముఖ్యమంత్రిని పట్టుకుని సవాల్ చేయడం చూస్తుంటే కేశినేని నాని బాడీలో హఠాత్తుగా ఉడుకు రక్తం వచ్చినట్టు కనిపిస్తోందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News