బాబు దోపిడి లెక్కలు చెబితే అభివృద్ధి ఆగుతుందా?
చంద్రబాబు హయాంలో జరిగిన దోపిడి వివరాలను బయటకు వెల్లడించాలని జస్టిస్ ఈశ్వరయ్యగౌడ్ కోరారు. గత ప్రభుత్వ అవినీతిపై సమీక్ష చేస్తే అభివృద్ధి ఆగిపోతుందంటూ కొందరు చేస్తున్న వాదనను ఆయన కొట్టిపారేశారు. రాజధాని, సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ది ముసుగులో చంద్రబాబు దోచుకున్న సొమ్ము లెక్కలు బయటకు తీసి, ప్రజలకు చూపిస్తే తప్పేంటని ప్రశ్నించారు. చంద్రబాబు తానా అంటే ఒక వర్గం మీడియా తందాన అంటోందని విమర్శించారు. ఇంట్లో దొంగలు పడకముందు ఎంత సొమ్ము ఉందో?… దొంగలు పడ్డాక ఎంత […]
చంద్రబాబు హయాంలో జరిగిన దోపిడి వివరాలను బయటకు వెల్లడించాలని జస్టిస్ ఈశ్వరయ్యగౌడ్ కోరారు. గత ప్రభుత్వ అవినీతిపై సమీక్ష చేస్తే అభివృద్ధి ఆగిపోతుందంటూ కొందరు చేస్తున్న వాదనను ఆయన కొట్టిపారేశారు.
రాజధాని, సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ది ముసుగులో చంద్రబాబు దోచుకున్న సొమ్ము లెక్కలు బయటకు తీసి, ప్రజలకు చూపిస్తే తప్పేంటని ప్రశ్నించారు. చంద్రబాబు తానా అంటే ఒక వర్గం మీడియా తందాన అంటోందని విమర్శించారు. ఇంట్లో దొంగలు పడకముందు ఎంత సొమ్ము ఉందో?… దొంగలు పడ్డాక ఎంత సొమ్ము పోయిందో? లెక్కలు తీసి వివరించడం తప్పు ఎలా అవుతుందని మీడియాను ప్రశ్నించారాయన.
ఇలా చేస్తే అభివృద్ధి ఆగిపోతుందని చెప్పడం ఏమిటన్నారు. చంద్రబాబు, ఆయన వర్గం మీడియా చేస్తున్న ప్రచారంపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్ణయాలను సమీక్షిస్తామనగానే చంద్రబాబు బెంబేలెత్తిపోవడం చూస్తుంటే … ఇంటి యజమానే ఇంటిని దోచుకున్నట్టుగా అర్థమవుతోందన్నారు.