సిట్టింగ్ జడ్జిపై సీబీఐ విచారణకు సీజే అనుమతి
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శుక్లాపై సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చారు. సిట్టింగ్ జడ్జిపై నేరుగా కేసు నమోదు చేసేందుకు అవకాశం లేకపోవడంతో సీబీఐ సీజేను ఆశ్రయించింది. కేసును పరిశీలించిన రంజన్ గొగోయ్ సీబీఐ కేసు నమోదుకు అనుమతి ఇచ్చారు. 2017లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ప్రయోజనం చేకూర్చేలా తీర్పులు ఇచ్చారన్న ఆరోపణలు శుక్లాపై వచ్చాయి. శుక్లా వ్యవహారంపై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ప్యానెల్ గతంలోనే […]
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శుక్లాపై సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చారు. సిట్టింగ్ జడ్జిపై నేరుగా కేసు నమోదు చేసేందుకు అవకాశం లేకపోవడంతో సీబీఐ సీజేను ఆశ్రయించింది. కేసును పరిశీలించిన రంజన్ గొగోయ్ సీబీఐ కేసు నమోదుకు అనుమతి ఇచ్చారు.
2017లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ప్రయోజనం చేకూర్చేలా తీర్పులు ఇచ్చారన్న ఆరోపణలు శుక్లాపై వచ్చాయి. శుక్లా వ్యవహారంపై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ప్యానెల్ గతంలోనే అతడు తప్పు చేసినట్టు తేల్చింది.
తప్పు చేసినందున న్యాయమూర్తిగా రాజీనామా చేయాలని నాటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఆదేశించారు. కానీ శుక్లా అందుకు అంగీకరించలేదు. తానిచ్చిన తీర్పును మాత్రం వెనక్కు తీసుకున్నారు.
అయితే ప్రస్తుత సీజే … శుక్లా వ్యవహారంపై ఇటీవల ప్రధానికి కూడా లేఖ రాశారు. శుక్లాను పార్లమెంట్‌లో అభిశంసించాలని లేఖలో కోరారు.
లక్నోలోని జీసీఆర్‌జీ మెడికల్ కాలేజీలో సరైన వసతులు లేకపోవడంతో అడ్మిషన్లకు నిరాకరించగా… శుక్లా బెంచ్ మాత్రం అడ్మిషన్లకు అనుమతినిస్తూ తీర్పు తెచ్చింది.
దీనిపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. శుక్లా తీర్పును సమీక్షించిన సుప్రీం కోర్టు దాన్ని కొట్టివేసింది.
ఈ వ్యవహారంలో శుక్లాపై అనేక ఆరోపణలు వచ్చాయి. అంతర్గత విచారణ జరిపిన ప్యానెల్… శుక్లా విలువలను గాలికి వదిలేశాడని, పదవి గౌరవాన్ని మంటగలిపాడని అభిప్రాయపడింది.