ఏపీ స్కూళ్లలో సెల్ ఫోన్లు బంద్

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లోని క్లాస్ రూమ్ లోకి టీచర్లు సెల్ ఫోన్లు తీసుకెళ్లడాన్ని నిషేధించింది. ప్రభుత్వ స్కూళ్ల బలోపేతంలో భాగంగా ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే డీఈవోలు, హెడ్ మాస్టర్లకు ఈ ఆదేశాలు వెళ్లాయి. వారి ద్వారా టీచర్లకు ఆ సమాచారం అందజేశారు. క్లాస్ రూమ్ లో టీచర్లు సెల్ ఫోన్లు వాడకుండా హెడ్ మాస్టర్లు చూడాలని డీఈవోలు స్పష్టమైన సూచనలు చేశారు . ఒకవేళ ఎవరైనా తీసుకెళ్లి […]

Advertisement
Update:2019-07-30 05:48 IST

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లోని క్లాస్ రూమ్ లోకి టీచర్లు సెల్ ఫోన్లు తీసుకెళ్లడాన్ని నిషేధించింది. ప్రభుత్వ స్కూళ్ల బలోపేతంలో భాగంగా ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే డీఈవోలు, హెడ్ మాస్టర్లకు ఈ ఆదేశాలు వెళ్లాయి. వారి ద్వారా టీచర్లకు ఆ సమాచారం అందజేశారు.

క్లాస్ రూమ్ లో టీచర్లు సెల్ ఫోన్లు వాడకుండా హెడ్ మాస్టర్లు చూడాలని డీఈవోలు స్పష్టమైన సూచనలు చేశారు . ఒకవేళ ఎవరైనా తీసుకెళ్లి మాట్లాడితే హెడ్ మాస్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో టిక్ టాక్ వాడకం పెరిగింది. పని వదిలేసి ఉద్యోగులు టిక్ టాక్, సెల్ ఫోన్లు చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు పెరిగాయి. టీచర్లు కూడా ఫోన్లు చూస్తూ పాఠాలు చెప్పడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్లాస్ రూమ్ లోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లడాన్ని ప్రభుత్వం నిషేధించింది.

నాలుగేళ్ల కిందట ప్రభుత్వం ఈ సర్క్యులర్ జారీ చేసింది. కానీ పకడ్బందీగా అమలు చేయలేదు. దీంతో టీచర్లు వాట్సాప్, ఫేస్ బుక్ లు చూస్తూ కాలం గడుపుతున్నారని సోషల్ మీడియాలో ఫిర్యాదులు పెరిగాయి. పలు గ్రూపుల్లో ట్రోలింగ్ నడిచింది. కొందరు టీచర్లు స్టూడెంట్స్ కు ఏదో ఒక అసైన్ మెంట్ ఇచ్చి…ఫోన్లో యూ ట్యూబ్ వీడియోలు చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

అయితే కొందరు టీచర్లు ఫోన్ల నిషేధాన్ని స్వాగతిస్తున్నారు. క్లాస్ రూమ్ వాతావరణాన్ని మొబైల్ ఫోన్లు వచ్చాక చెడగొట్టాయని అంటున్నారు.

అయితే ప్రధానోపాధ్యాయులతో పాటు కొందరు టీచర్లకు రోజుకు పది రకాల స్కూల్ సమాచారాన్ని యాప్ లలో అప్ డేట్ చేయాల్సి వస్తుందని….అందుకోసమే ఫోన్ యూజ్ చేస్తున్నామని అంటున్నారు.

సీఎస్ఈ వెబ్ సైట్ల లో కూడా రోజువారీ సమాచారాన్ని అప్ డేట్ చేయాల్సి వస్తోందని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి స్కూళ్ల లో సెల్ బ్యాన్ ను సమర్ధవంతంగా అమలు చేయాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News