ఉన్నావూ బాధితురాలికి తీవ్రగాయాలు
ఉన్నావులో బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ అత్యాచారం చేశాడని ఆరోపించిన మహిళ ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీ సమీపంలో ఒక కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమెతో పాటు ప్రయాణిస్తున్న ఆమె బంధువులు ఇద్దరు ఈ ప్రమాదంలో చనిపోయారు. ఆమె, ఆమె న్యాయవాది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి గురైన కారును లాయర్ నడుపుతున్నట్లు తెలిసింది. కారుకు ఎదురుగా వచ్చిన ఒక ట్రక్ గుద్దటంతో ఈ ప్రమాదం జరిగింది. గత ఏడాది ఏప్రిల్ మాసంలో ఉత్తర […]
ఉన్నావులో బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ అత్యాచారం చేశాడని ఆరోపించిన మహిళ ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీ సమీపంలో ఒక కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమెతో పాటు ప్రయాణిస్తున్న ఆమె బంధువులు ఇద్దరు ఈ ప్రమాదంలో చనిపోయారు. ఆమె, ఆమె న్యాయవాది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రమాదానికి గురైన కారును లాయర్ నడుపుతున్నట్లు తెలిసింది. కారుకు ఎదురుగా వచ్చిన ఒక ట్రక్ గుద్దటంతో ఈ ప్రమాదం జరిగింది.
గత ఏడాది ఏప్రిల్ మాసంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ఈ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడంతో ఉన్నావూ ఉదంతం బాహ్య ప్రపంచానికి తెలిసింది. తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేశాడని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె చెప్పింది. దీంతో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఫలితంగా ఆమె కేసును సీబీఐ కి బదిలీ చేశారు.
తర్వాత ఎమ్మెల్యే సెంగార్‌ని అరెస్టు చేశారు. ఏప్రిల్ 3న ఎమ్మెల్యే సోదరుడు, ఇతరులు కలిసి ఆ మహిళ తండ్రిపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. పోలీసులు ఆమె తండ్రిని కస్టడీలోకి తీసుకున్నారు. గాయాలతో అతడు అక్కడే మరణించాడు.
ఆమెను చంపేందుకు, సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ఎమ్మెల్యేనే ఈ ప్రమాదం ఒక పథకం ప్రకారం చేయించాడని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఆరోపించాయి. ఆ ట్రక్ డ్రైవర్ నూ, ట్రక్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో ఉండాల్సిన ఎస్కార్ట్ పోలీసులు ఆ సమయంలో ఎందుకు లేరో విచారణ జరుపుతామని పోలీసు అధికారులు చెప్పారు.